23 నుంచి మొద‌లు… అదే 23తో జ‌గ‌న్‌కు రెండు పెద్ద షాకులిచ్చిన చంద్ర‌బాబు…!

గత సాధారణ ఎన్నికలలో వైసిపి అప్రతిహత విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు చంద్రబాబును, టిడిపిని 23 నెంబర్ చెబుతూ ఎద్దేవా చేయటం పరిపాటిగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయ‌న పాల‌న‌కు ఆక‌ర్షితులు అయ్యి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరారు. ఏ 23 మంది ఎమ్మెల్యేలను త‌మ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్నారో ?చివరకు ఆయన అదే 23 స్థానాలకు పరిమితం అయిపోయారని.. ఇదంతా దేవుడు రాసిన రాత అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.

వైఎస్ కుటుంబానిది 32వేల ఎకరాల భూకుంభకోణం....: పంచుమర్తి అనురాధ | tdp leader panchumarthi  anuradha allegations on ys jagan and his family

అయితే దేవుడు అదే 23 నెంబర్‌తో ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కి పెద్ద షాక్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు పతనం 23 నుంచి మొదలైందని.. జగన్ వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఇప్పుడు అదే జగన్‌కు, వైసిపి నేతలకు 23 సాక్షిగా ఈ రోజు రెండు అదిరిపోయే షాక్ లు తగిలాయి. ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కేవలం 19 ఓట్ల బలం ఉన్న టిడిపి 23 ఓట్లు సాధించి ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంది. టిడిపి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి.

MLC poll results indicate anti-incumbency, rebellion: Chandrababu Naidu |  Business Standard News

వైసిపి నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎవరికి 23 ఓట్లు రాలేదు. మొత్తం ఈరోజు గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరిలోనూ అనురాధకే ఎక్కువగా 23 ఓట్లు వచ్చాయి. ఇక ఈ రోజు మరో విశేషం ఏంటంటే 23వ తేదీ కావటం. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిచిన‌ప్పుడు కూడా మే 23వ తేదీ. ఇప్పుడు అదే తేదీతో చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు రివ‌ర్స్ షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది.

AP economy under threat from Jagan populist schemes

అలా 23 నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు.. అదే 23వ తేదీన వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే ఎక్కువగా 23 ఓట్లు సాధించి.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు టిడిపి నేతలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలను 23 నెంబర్ పేరు చెప్పి ఓ ఆటాడుకుంటున్నారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పతనం కూడా అదే 23 నుంచి మొదలు పెట్టామని చెబుతున్నారు.

Tags: AP, ap politics, chandrababu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp