Anupama : నేను ఆ టైప్ కాదు.. హీరోలని పొగిడి వాళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama ) కార్తికేయ 2 తో నేషనల్ లెవల్ లో సూపర్ హిట్ అందుకుంది. అనుపమ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక కార్తికేయ 2 సక్సెస్ జోష్ లో ఉన్న అనుపమ తను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయనని.. పాత్ర ప్రాధాన్యత ఉంటేనే చేస్తానని అంటుంది. అంతేకాదు హీరోలని పొగిడి వాళ్ల చుట్టూ తిరిగే హీరోయిన్ పాత్రలు అసలు చేయనని అంటుంది అనుపమ.

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా రోజులు అవుతున్నా ఇంకా యువ హీరోల దగ్గరే అమ్మడు ఆగిపోయింది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో పాటల కోసమే కొందరు హీరోయిన్స్ కనిపిస్తారు. అయితే అలాంటి సినిమాలు నేను చేయనని అంటుంది అనుపమ (Anupama ). బహుశా అలాంటి స్టార్ సినిమా ఛాన్సులు ఇదివరకు వచ్చినా చేయలేదు కావొచ్చు.

ప్రస్తుతం తెలుగులో ఇప్పుడున్న నటీమణుల్లో ఏ పాత్ర అయినా చేయగలిగే వారిలో అనుపమ కూడా ఒకరని చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు స్టార్ సినిమాలు క్రేజ్ కోసమైనా చేయాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో అనుపమ మనసు మార్చుకుంటుందో లేదో చూడాలి.

Tags: Anupama, Anupama Parameswaran, karthikeya 2, Premam, Star Craze, Tollywood