Pawan Kalyan : హరి హర మళ్ళీ సెట్ అంటున్న క్రిష్..!

క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) హీరోగా హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ చాలా తక్కువ అవడంతో సినిమాని ఒక్కసారిగా పూర్తి చేయలేకపోతున్నాడు క్రిష్.

ఇక లేటెస్ట్ గా పవన్ (Pawan Kalyan ) హరి హర కోసం డేట్స్ లాక్ చేశారట. అయితే ఈ సినిమా కోసం క్రిష్ మరో భారీ సెట్ వేయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కోసం సెట్స్ వేయగా మళ్లీ మరో సెట్ వేయిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గజ దొంగ పాత్రలో కనిపిస్తారట. పవర్ స్టార్ తన ఇమేజ్ కి దూరంగా కొత్తగా ఈ సినిమా చేస్తున్నారు.

ఇక మరోపక్క మరో తమిళ సినిమా రీమేక్ కి పవన్ ఓకే చెప్పారని తెలుస్తుంది. వినోదయ సీతం సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Tags: Another Huge Set for Powerstar Pawan Kalyan Hari Hara Veera Mallu