కాజల్ పెళ్లికి ముందు.. ఆ టాలీవుడ్‌ హీరోని పిచ్చిగా ప్రేమించి మోసపోయిందా..!

సౌత్ ఇండియాలోనే నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా చలామణి అయింది కాజల్ అగర్వాల్. సినిమాల్లో నటిస్తున్నంత కాలం ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నానుతునే ఉండేది. సినిమాలు తగ్గుతున్న క్రమంలో తన చిన్ననాటి మిత్రుడైన గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. నాటి నుంచి నేటి వరకు కాజల్ అగర్వాల్ గురించి ఏదో ఒక వార్త ఎప్పుడు సంచలన సృష్టిస్తూనే ఉంది. 2007వ సంవత్సరంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది కాజల్.

Ganesh (2009 film) - Wikipedia

అలా 15 సంవత్సరాల పాటు తన ఎరాను టాలీవుడ్ పై చూపించింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ జతకట్టిన కాజల్ తండ్రి కొడుకులు అయిన చిరంజీవి, రామ్ చరణ్‌తో సైతం నటించి నాటి హీరోయిన్ శ్రీదేవి రికార్డును బద్దలు కొట్టింది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్ హిందీలో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక తన నట వారసత్వాన్ని తన చెల్లి నిషా అగర్వాల్ సైతం కొనసాగించింది. ఆమె సైతం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా త్వ‌ర‌గానే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యింది.

ఇక ఇటీవల ఒక మీడియా సంస్థతో చాట్ చేస్తూ తన జీవితంలో బాధపడ్డ క్షణాల గురించి బయట పెట్టింది కాజల్. తన జీవితంలో కేవలం ఒకే ఒక్కసారి ఏడ్చాను అని… అది కూడా ప్రేమ విషయంలోనే అంటూ కుండ బద్దలు కొట్టింది. మొదటగా తాను స్కూల్లో ఉన్న సమయంలో తోటి స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డానంటూ చెప్పుకొచ్చిన కాజల్.. అన‌తి కాలంలోనే ఆ అబ్బాయి మరొక అమ్మాయితో క్లోజ్‌గా ఉండ‌డంతో తనకు బ్రేకప్ అయ్యిందని చెప్పింది.

Thanemando Full HD Video Song | Ganesh Movie | Ram Pothineni | Kajal |  Mickey J Mayor | Saravanan - YouTube

ఇక ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీతో సంబంధం లేని ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డట్టుగా చెప్పింది. అతడు పేరు చెప్పకపోయినా ఆ వ్యక్తికి.. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని చెప్పింది. అతడితో బ్రేకప్ అయ్యాక చాలా రోజులపాటు డిప్రెషన్ కి గురైనట్టుగా కూడా తెలిపింది. అప్పుడే మొదటిసారి తాను ఏడ్చానని ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశాలు రాలేదంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో హీరో రామ్ పోతినేనితో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింద‌న్న పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఓసారి ఇంటర్వ్యూలో కాజల్ ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేద‌ని కొట్టి పారేసింది. హీరో రామ్ కాజల్ అగర్వాల్‌తో గణేష్ సినిమా చేయగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తోంది. కానీ అతి తక్కువ టైంలోనే వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారట.