Tejaswi : తాగుడికి అలవాటయ్యానని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!

మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్క డైలాగ్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఛాన్సులు అందుకుంది తేజశ్వి మడివాడ (Tejaswi ). ఆర్జీవి ఐస్ క్రీం సినిమాలో ఆమె చేసిన హాట్ షో ఆడియెన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది. కెరియర్ లో అటు ఇటుగా ఉన్న టైం లో బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లిన తేజశ్వి అక్కడ కూడా రచ్చ రచ్చ చేసింది.

అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాక కౌశల్ ఆర్మీ వల్ల తను చాలా డిస్ట్రబ్ అయ్యానని అంటుంది తేజశ్వి (Tejaswi ) ఆ టైం లో కెరియర్ మీద ఆసక్తి కూడా పెట్టలేకపోయానని తాగుడికి కూడా అలవాటు పడ్డానని బోల్డ్ గా చెప్పింది తేజశ్వి. అందుకే తన లుక్ కొద్దిగా మారిందని అయితే ఇప్పుడు మళ్లీ కెరియర్ మీద దృష్టి పెట్టాలని చూస్తుంది.

లేటెస్ట్ గా కమిట్మెంట్ అనే సినిమా చేసిన తేజశ్వి ఆ సినిమాలో బోల్డ్ రోల్ లో మెప్పించింది. తెలుగు అమ్మాయి అయిన తేజశ్వి ఇప్పటికే హాట్ ఇమేజ్ తెచ్చుకోగా మరిన్ని సినిమాలు చేయాలని చూస్తుంది.

Tags: Commitment, Tejaswi, Tejaswi BiggBoss, Tejaswi Madivada, Tollywood