అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) బాలయ్య బాబుతో అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ తో అమ్మడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుంది అనుకుంటే అది జరగలేదు. ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉన్నా సరే తన అప్డేట్స్ తో అలరిస్తుంది ప్రగ్యా జైశ్వాల్. తన హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకి నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ గా అద్దాల డ్రెస్ తో అదరగొట్టింది.
ముంబైలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఇలా పై నుంచి కింద దాకా అద్దాలున్న డ్రెస్ తో అందాలని ప్రదర్శించింది. పర్ఫెక్ట్ హాట్ బ్యూటీ కటౌట్ అయినా కూడా అమ్మడికి ఎందుకో సరైన ఛాన్సులు రావట్లేదు. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ఎవరితో అయినా నటించేందుకు రెడీ అని చెబుతున్నా సరే ప్రగ్యాని పట్టించుకోవడం లేదు.
అఖండ హిట్ తో అమ్మడి రేంజ్ పెరుగుతుందని భావిస్తే ఆ తర్వాత సినిమా ఛాన్స్ లేకుండాపోయింది. అయితే బోయపాటి శ్రీను అఖండ 2 సినిమా తీస్తే మాత్రం మళ్లీ అందులో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ ని తీసుకుంటారని చెప్పొచ్చు.