‘ ఆదిపురుష్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది…. ఆకాశామే హ‌ద్దురా బాబోయ్‌…!

తిరుపతి వెంకన్న సాక్షిగా ఈరోజు ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎంతో ఘనంగా జరగనుంది. ఇప్పటివరకు ఏ సినిమా ఫంక్షన్లకు గెస్ట్ గా రాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి ఈ ఈవెంట్ కు రానున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందుకే చిన‌ జీయర్ స్వామిని గెస్ట్‌గా ఆహ్వానించారు ఆదిపురుష్‌ చిత్ర యూనిట్.

Himesh on Twitter: "ADIPURUSH new poster OUT NOW - On #Prabhas' birthday,  #Adipurush team unveil a new poster of the film, which is all set for a  January 12 release. #HappyBirthdayPrabhas https://t.co/USMHRjibut" /

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న రాత్రే తిరుపతి చేరుకున్నారు ప్రభాస్, చిత్ర యూనిట్. అంతేకాకుండా ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో పాల్గొన్నారు. బాహుబలి సెంటిమెంట్‌తో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి మొత్తం ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ఆకాశ‌మే హద్దుగా ఈ ఈవెంట్‌కు అభిమానులు రెడీ అవుతున్నారు.

Adipurush (2023) - Photo Gallery - IMDb

జై శ్రీరామ్ నినాదంతో తిరుమల మారుమోగిపోతోంది. తాజాగా ఆదిపురుష్ ఓటిటి రిలీజ్ పై కూడా ఓ ఇంట్రెస్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ పార్ట్‌న‌ర్‌ను ఓ అదిరిపోయే ఫిగర్ తో లాక్ చేసిందని బాలీవుడ్‌లో ఓ వార్త వైరల్ గా మారింది.

Who should be the cast for the Adi Purush movie? - Quora

ఇక ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేటర్ అండ్ థియేటర్ రైట్స్ బిజినెస్ దాదాపు రూ. 432 కోట్లకు పైగా చేసిందని టాక్. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి.. దాదాపు రూ.250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంద‌ట‌. బాలీవుడ్ మీడియాలో ఇప్పుడిదే హాట్ న్యూస్.