Srileela : శ్రీలీల మాములుగా ఊపట్లేదుగా.. కళ్లన్ని వాటిమీదే..!

శ్రీకాంత్ తనయుడు పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ శ్రీలీల (Srileela). మొదటి సినిమాతోనే ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. రవితేజతో ధమాకా సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ మాములుగా ఉండదు. తన ఫోటో షూట్స్ తో క్రేజీ వీడియోలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది శ్రీలీల.

లేటెస్ట్ గా శ్రీలీల నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో రాను రానంటూనే చినందో సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. డ్యాన్స్ లో తన టాలెంట్ చూపించేలా అమ్మడు ఆ సాంగ్ కి ఒక ఊపు ఊపేసింది శ్రీలీల (Srileela). నితిన్, కృతి శెట్టి జోడీగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా లాస్ట్ ఫ్రై డే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేదు.

అయితే సినిమాలోని సాంగ్స్ మాత్రం ఇలా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. శ్రీలీల రాను రానంటూనే చినందో సాంగ్ డ్యాన్స్ చేయడం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేందుకే శ్రీలీల ఈ ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు.

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)