యాంకర్ కమ్ నటి అనసూయకు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మధ్య కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన సమయంలో ఆ మూవీలోని కొన్ని సీన్స్ పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది.విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అనసూయకు విజయ్ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ఆమె మాట్లాడకుండా గోల గోల చేశారు.
అప్పట్నుంచి అనసూయకు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. నిన్న విజయ్ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫలితంపై పరోక్షంగా అనసూయ ఒక ట్వీట్ చేసింది. ‘ అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా’ అని ట్వీట్ చేసింది.
అయితే అనసూయ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ప్లాప్ కావడంతోనే ఈ ట్వీట్ చేసిందని విజయ్ ఫ్యాన్స్ ఆమె పై మండిపడ్డారు. ట్విట్టర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అనసూయపై ట్రోల్స్ చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఇంత జరిగినా అనసూయ ఏ మాత్రం తగ్గలేదు. మరోసారి ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టింది. ‘ఛీ ఛీ.. అసలు ఎంత చెత్త బాబోయ్.. క్లీన్ చేసి చేసి విసుగొస్తోంది’ అని తనపై జరుగుతున్న ట్రోల్స్ పై పరోక్షంగా స్పందించింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయ నేరుగా ప్రత్యక్ష వార్ కి దిగడం సెన్సేషన్ గా మారింది.