Prabhas : ప్రభాస్ కోసం హాలీవుడ్ నుంచి దిగుతున్నారట..!

రెబల్ స్టార్ Prabhas సలార్ సినిమా సెట్స్ మీద ఉండగానే మారుతితో సినిమాకి రెడీ అవుతున్నాడని తెలిసిందే. రీసెంట్ గానే ఆ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు జరుపుకున్నారని తెలుస్తుంది. రాజా డీలక్స్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మిస్తున్నారు. తాతా మనవళ్ల మధ్య జరిగే కథగా ఈ సినిమా వస్తుందని టాక్. సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. ప్రభాస్ డ్యుయల్ రోల్ లో ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ప్రభాస్ ఓల్డ్ గెటప్ కోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్ లను దించుతున్నారట. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టీం ని ఈ సినిమా కోసం స్పెషల్ గా తీసుకొస్తున్నారట. ముందు Prabhas తో లుక్ టెస్ట్ చేయించుకుంటారని తెలుస్తుంది.

మారుతి సినిమా కోసం ప్రభాస్ కేవలం రెండు నెలలు మాత్రమే కేటాయిస్తున్నారని టాక్. ఆదిపురుష్ ఎలాగు పూర్తి కాగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో వస్తుంది.ఇదే కాదు ప్రభాస్ కోసం ఇంకా మూడు భారీ ప్రాజెక్ట్ లు భారీ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి.

 

Tags: Adipurush, Hollywood, Maruthi, Prabhas, Prabhas Salaar, Raja Deluxe, UV Creations