Nagarjuna : బిగ్ బాస్ 6 కోసం నాగార్జున మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

ఐదు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6కి రెడీ అవుతుంది. ఐదు సీజన్లు స్టార్ మాలో రాగా..ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ అని ఒకటి నడిపించారు. అయితే అది కేవలం ఓటీటీ ఆడియెన్స్ కోసమే అవడంతో అది పెద్దగా సక్సెస్ అవలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈసారి స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తారని తెలుస్తుంది.

ఒకప్పటి హీరోలు.. స్టార్ కమెడియన్లు.. యాంకర్లు.. డ్యాన్స్ మాస్టర్ ఇలా అందరిని కవర్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ సీజన్ కోసం నాగ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు సీజన్లు కోసం 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న నాగ్ ఈసారి 18 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

సీజన్ 1 ఎన్.టి.ఆర్.. సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 5 దాకా నాగ్ (Nagarjuna) హోస్ట్ గా చేశాడు, ఇక సీజన్ 6 నాగ్ మరింత జోష్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ నెల చివరన కానీ సెప్టెంబర్ మొదటి వారం గాని బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అవుతుందని టాక్.

Tags: BB6, BiggBoss, BiggBoss Season 6, Host Nagarjuna, movies, nagarjuna, Star Maa