అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్ వైరల్‌గా మారింది.
సుకుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు.దానితో షూటింగ్ ప్రారంభమైందని వెల్లడించడానికి చిన్న టీజర్‌ను రూపొందించాడు.లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2తో పాటు ఈ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక న్యూస్ ఇంకా వెలువడాల్సి ఉంది.సుకుమార్ సీక్వెల్ కోసం భారీ ప్రణాళికలు వేస్తున్నాడు.దాని కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించనున్నారు.