టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇమేజ్ కాస్త భిన్నంగా ఉండేది. అఖండ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో బాలయ్యకు కొత్త క్రేజ్‌తో కేక పుట్టిస్తున్నాడు. ఆ ప్రభావం ఇప్పుడు రాబొయ్యే చిత్రం నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌పై కూడా కనిపిస్తోంది.మొదట్లో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసారు కానీ ఆ మధ్య అఖండ భారీ హిట్ అవ్వడంతో బాలయ్య రెమ్యూనరేషన్ ని 12 కోట్ల రూపాయలకు రివైజ్ చేసాడు.
అనిల్ రావిపూడితో సినిమా కోసం బాలకృష్ణ ముందుగా 12 కోట్లకు అంగీకరించారు. ఇప్పుడు దాన్నిరెమ్యూనరేషన్ కూడా సవరించబోతున్నారు. ఈ సవరించిన మొత్తం ‘వీరసింహారెడ్డి’ విడుదల తర్వాత నిర్ణయించబడుతుంది.మొత్తం మీద నలుగురు సీనియర్ హీరోల్లో బాలకృష్ణకు మాత్రమే మంచి క్రేజ్, లైన్ అప్, మార్కెట్ వ్యాల్యూ ఉన్నాయి. కానీ బాలకృష్ణ 40 కోట్లు, 50 కోట్లు డిమాండ్ చేయడం లేదు.నాగ్ మరియు వెంకటేష్ ఇప్పటికీ రూ. 8 కోట్ల రేంజ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే 40 కోట్లు 50 కోట్ల రేంజ్‌లో ఉన్నారు.