అల్లు అర్జున్‌ AAA మల్టీప్లెక్స్‌లో ఇన్ని స్పెషాలిటీసా… ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడా…!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ AAA అనే పేరుతో హైద‌రాబాద్‌లో ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్ ను ప్రతిష్టాత్మకంగా
నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇంతకుముందే మహేష్ బాబు ఏఎంబీ మల్టీప్లెక్స్ నిర్మించి థియేటర్ రంగంలోనికి అడుగు పెట్టారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ థియేటర్‌ను అద్భుత‌మైన టెక్నాలజీతో, అనేక హంగులతో నిర్మించబోతున్నారని సమాచారం.

It's Time For Allu Arjun's AAA!

 

గత రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఇంకా మూడు నెలల్లో పూర్తి కాబోతుందిదట. ఈ సమయంలో ఈ మల్టీప్లెక్స్‌లో ఓ స్క్రీన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌత్ ఇండియాలోనే కేవలం ప్రొజెక్టర్ అవసరం లేకుండా పనిచేసే స్క్రీన్ ఇందులో ఉంద‌ట‌. ఈ ప్రొజెక్టర్ అవసరం లేకుండానే టెక్నాలజీ సౌకర్యంతో ఈ స్క్రీన్ పనిచేస్తుంది.

AMB Cinemas's Special Packages For Trailer Launches!

సౌత్ ఇండియాలోనే అల్లు అర్జున్ నిర్మించబోతున్న ఈ మల్టీప్లెక్స్‌లో మాత్రమే ఇటువంటి స్క్రీన్ కనపడబోతోంది. ఏషియన్ స్క్రీన్స్‌తో కలిసి నిర్మించబోతున్న ఈ మల్టీప్లెక్స్‌కు అల్లు అర్జున్ భారీగా ఖర్చు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, విశాలమైన లాంజ్‌, కంఫర్టబుల్ సీటింగ్.. ఇలా ఎన్నో రకాల హాంగులతో కూడిన ఈ మల్టీప్లెక్స్ కోసం అల్లు అర్జున్ కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

ఇంచుమించు ఈ మల్టీప్లెక్స్ కు రూ 100 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ కంటే ముందే మహేష్ బాబుతో క‌లిసి జాయింట్‌గా ఏషియన్ వారు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. కాకపోతే దానికి మించిన హంగులతో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం జరుగుతుందని సమాచారం. మరి మూడు నెలల్లో రెడీ కాబోతున్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్ అల్లు అర్జున్ జీవితంలోనే స్పెష‌ల్‌గా నిలుస్తుంది.

Tags: allu arjun, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, stylish star, telugu news, Tollywood, trendy news, viral news