అలియా వేసుకున్న ఈ డ్రెస్ స్పెషాలిటి ఏంటో తెలుసా.. ధర విన్నరంటే దిమ్మ తిరిగిపొద్ది..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియా భట్.. ప్రెసెంట్ ఓవైపు బేబీని చూసుకుంటూనే ..మరోవైపు సినిమాలలో బిజీగా రాణిస్తుంది. కాగా రణ్ బీర్ కపూర్ ని ఐదేళ్లు ప్రేమించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత డేటింగ్ చేసి ..ఆ తర్వాత పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకుంది . రీసెంట్ గానే పండు లాంటి పాపకు జన్మనిచ్చింది, పెళ్లి తర్వాత ఫుల్ బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్ తో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న అలియా భట్ రీసెంట్గా న్యూయార్క్ సిటీలో జరుగుతున్న మెట్ గల 2023 వేడుకల్లో పాల్గొంది .

ఈ వేడుకల్లో అలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, మరీ ముఖ్యంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఈవెంట్ కి హైలైట్ గా మారింది . ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ డ్రెస్ దాదాపు లక్ష్య ముత్యాలతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తుంది . ఈ లాంగ్ ఫ్రాక్ ని అలియాభట్ స్పెషల్గా డిజైన్ చేయించుకుందట . సాంప్రదయ లుక్స్ లో కనిపించాలనే ఇలాంటి ఓ ట్రెడిషనల్ ఔట్ఫిట్ ను డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ ఫ్రాక్ లో అమర్చబడిన ప్రతి ముత్యం ఒరిజినల్ ముత్యం. సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్ లుక్స్ ఉండడానికి ఆమె ఈ ఫ్రాక్ డిజైన్ చేయించుకుంది అంటూ తెలుస్తుంది . అంతేకాదు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా అలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ శ్వేత వర్ణ గౌన్లో ఆమె ఎంతో అద్భుతంగా కనిపించింది . ఇంకా చెప్పాలంటే చూపు తిప్పుకోలేకపోయారు అక్కడున్న జనాలు .

ఈ క్రమంలోని ఈ ఫొటోస్ చూసిన స్టార్స్ అలియా లుక్స్ కు ఫిదా అవుతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రెస్ ఖరిదు 50 లక్షలు అంటూ తెలుస్తుంది. “సాంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను కాబట్టి.. ఈ ఎంబ్రాయిడరీ లక్ష్య ముత్యాలతో రూపుదిద్దుకున్న ఫ్రాక్ ను ధరించాను ” అంటూ అలియా భట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే అలియాభట్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మాతాయి..!!

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)