Top 5: షాకింగ్ డిజాస్టర్స్ & అట్టర్ ప్లాప్ సినిమాలు..

1. Thank You : నాగ చైతన్య దీనితో తన జీవితంలో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నాడు.

జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాగార్జునకి ‘ఆఫీసర్’ లాగా ఈ సినిమా కూడా నాగ చైతన్య కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రానికి రాశి ఖాన్, మాళవిక నాయర్, అవికా మరియు ప్రకాష్ రాజ్ లాంటి మంచి నటీనటులు ఉన్నారు, కాని కంటెంట్ బలహీనంగా ఉన్నందున ఏదీ పని చేయలేదు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

2. The Warrior : రామ్ పోతినేని ఫిల్మోగ్రఫీలో ఫెయిల్యూర్స్‌లో ఇదీ ఒకటి.

మాస్ ఆడియన్స్‌లో కొంత హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

రామ్ మరియు ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించగా, కృతి శెట్టి మరియు అక్షర గౌడ వారి పాత్రలలో పనిచేశారు. ఈ చిత్రానికి లింగిస్వామి దర్శకత్వం వహించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాత.

3. Shamshera : కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు చేతులు ఏతేసింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది మరియు అంతేకాకుండా ఇది ఒక రకమైన అసహ్యకరమైన కంటెంట్ తో ప్రేక్షకులలో బాడ్ టాక్ ను అందుకుంది.

బానిసగా ఉండి నాయకుడిగా మారి తన తెగకు పురాణగాథగా మారిన వ్యక్తి కథ ఇది. అతను తన తెగ స్వేచ్ఛ మరియు గౌరవం కోసం విరామం లేకుండా పోరాడుతాడు. కానీ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు.

4. Darja : గాలిలో చిన్న పొగలాగా ఎవరికీ తెలియకుండా పోయిన సినిమా ఇది. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది ఒక క్రిమినల్ లేడీ మరియు ఒక పోలీసు కథ. అనసూయ ఈ సినిమాలో కంచు కనకం పాత్రలో తగినంత గ్లామర్‌ను ప్రదర్శించినా ప్రేక్షకులు అందుకోలేకపోయారు.

5. Rocketry : నిర్మాత, దర్శకుడు మరియు ప్రధాన నటుడిగా ఆర్ మాధవన్ రూపొందించిన ఈ చిత్రం భారీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కలెక్షన్లు భారీగా పడిపోయినా ఈ వారం ఈ స్లాట్‌లోనే ఉంది. ఈ చిత్రం దాని మెచ్యూర్డ్ కంటెంట్ కారణంగా యువ ప్రేక్షకులను మరియు బాగా చదువుకున్న ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ఇది బాక్స్ ఆఫిస్ వద్ద డ్రామా గానే మిగిలిపోయింది.

 

Tags: Darja movie, Rocketry movie, Shamshera, thank you movie, The Warrior movie