అల్లు అర్జున్ తో ఆహా భారీ ప్లాన్.. ఓటీటీ లో పాన్ ఇండియా టాక్ షో..

Allu-Arjun-Aha

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి హీరో గ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమయిన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. వరుస బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్ సినిమాలందించారు. తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్ లు, ఫ్లాప్ లు , ఎత్తుపల్లాలు చూశారు. టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో అటు వెండితెర.. ఇటు బుల్లితెరను ఏలుతున్నారు . ఇప్పటికే చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరులు, బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే, నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాష్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. అలరిస్తున్నారు. బాలకృష్ణ మాత్రం ప్రజెంట్ టాక్ షోను ఏలేస్తున్నారు.
Allu-Arjun-Aha
వీరి బాటలోనే యంగ్ హీరోలు నాని, జూనియర్ ఎన్టీఆర్, రానాలు కూడా నడిచారు. బుల్లితెర, ఓటీటీల్లో టాక్ షోలు, రియాల్టీ షోలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పడు ఆ బాటలో వెళ్లడానికి రెడీ అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇది సాదాసీదా టాక్ షో కాదట. ఏకంగా పాన్ ఇండియా లెవెల్ షో అట.

ఒక విధంగా ఇలాంటి షో రావడానికి ప్రధానం కారణం అల్లు అరవింద్ ఆలోచన విధానం అనే చెప్పాలి. ప్రత్యేకంగా బాలయ్యను ఒప్పించడం వల్లనే ఆహా ఈ రేంజ్ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు ఆహా స్థాయిని కూడా మరొక లెవెల్ కు పెంచాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తమిళంలో కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే అక్కడివారిని కూడా ఆకట్టుకునే విధంగా అగ్ర హీరోలతో మరిన్ని టాక్ షోలను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
Balakrishna-Aha

అయితే అల్లు అర్జున్ తో కూడా ఒక ఓటీటీ టాక్ షో ప్లాన్ చేయబోతున్నట్లుగా ఇటీవల టాక్ అయితే వినిపించింది. పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ తో ఫ్యాన్ ఇండియా తరహాలోనే ఓటీటీ టాక్ షోను తీసుకురావాలి అని అనుకుంటున్నారట. ఆహా క్రియేటివ్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ఒక ఐడియాతో ఇదివరకే అల్లు అరవింద్ తో కొన్నిసార్లు చర్చించినట్లుగా తెలుస్తోంది. అందుకు మాత్రం ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ షో సక్సెస్ ఫుల్ కొనసాగుతోంది కాబట్టే పోటీగా అలాంటి రిస్కులు తీసుకోకూడదు అని ఫిక్స్ అయ్యారట. ముందుగా అన్ స్టానబుల్ సెకండ్ సీజన్ పూర్తయిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిద్దామని కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అల్లు అర్జున్ పుష్ప కంటే ముందే టాక్ షోతో వచ్చే అవకాశం ఉంది. అలా అల్లు అర్జున్ చేస్తే ఒక విధంగా పుష్పా 2కి కూడా హెల్ప్ అవుతుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
Allu-Arjun-Aha

ఐకాన్ స్టార్ ఓటీటీలో పాన్ ఇండియా టాక్ షో ప్లాన్ చేస్తున్నారు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అల్లు అర్జున్ తో టాక్ షో అంటే ఓటీటీ రికార్డ్స్ బద్ధలవ్వడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు. బన్నీతో టాక్ షో అంటే మామూలుగా ఉండదు అంటున్నారు. పుష్ప అంటే హీరో అనుకుంటున్నార్రా.. హోస్ట్ కూడా.. నీ యమ్మ తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

Tags: aha, Aha OTT, allu arjun, Unstoppable