‘ ఆదిపురుష్ ‘ ప్ల‌స్‌లేంటి… మైన‌స్ లేంటి… సాహో, రాధేశ్యామ్ త‌ర్వాత కూడా ఇలా చేశావేంటి ప్ర‌భాస్‌..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల షోలు కంప్లీట్ అవ్వ‌డంతో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంది. క‌రెక్టుగా 2.59 గంట‌ల నిడివితో ఉన్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. దర్శకుడు ఓం రౌత్.. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవి వనవాసం సన్నివేశంతో కథలోకి వెళ్లాడు. సినిమా స్టార్టింగే ఓ యాక్ష‌న్ స‌న్నివేశంతో ప్ర‌భాస్ ఎంట్రీతో ఉంటుంది.

Adipurush Box Office Day 1 Advance Booking (2 Days To Go): Prabhas Starrer  Crosses 5 Crore Mark But The Response Is Far From Fantastic!

 

అంతకు ముందు రావణుడిగా సైఫ్ అలీఖాన్ భయంకరమైన ఎంట్రీ ఇస్తాడు. శూర్పణఖ సన్నివేశాన్ని ప్లాష్‌బ్యాక్‌లో చూపించారు. ఆ త‌ర్వాత ల‌క్ష్మ‌ణరేఖ సీన్, మాయ‌లేడి సీన్లు వ‌రుస‌గా వ‌స్తాయి. రావ‌ణుడు సీతాదేవిని అప‌హ‌రించ‌డంతో క‌థ కాస్త సీరియ‌స్‌గా మారుతుంది. హ‌నుమంతుడిగా దేవ‌ద‌త్త నాగే ఎంట్రీ ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది.

 

ఇక సుగ్రీవుడు, వాలి ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. సుగ్రీవుడి కోట, అంధులు జంతువుల విజువల్స్ అన్నీ కూడా మోడ్ర‌న్ జ‌న‌రేష‌న్‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. హ‌నుమంతుడు లంక‌లోకి వెళ్లి… లంక‌ను ద‌హ‌నం చేసే సీన్ పూర్తిగా గ్రాఫిక్స్ మ‌యం చేసేశాడు. ఓం రౌత్ చాలా చోట్ల సినిమాటిక్ లిబ‌ర్టీ ఎక్కువుగా తీసుకుని విజువ‌ల్స్‌తో న‌డిపించేశాడు. ఈ క్ర‌మంలోనే రామాయ‌ణంలో నేటివిటి మిస్ అయ్యింది.

Adipurush Ticket Costs Rs 2200 In Delhi Theatre, Multiple Shows Houseful  for Prabhas Film

రామాయ‌ణం గురించి బాగా అవ‌గాహ‌న ఉన్న వారు కాస్త నిరాశ చెందుతారు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నాసిరకంగా కూడా ఉంటాయి. రామ‌సేతు నిర్మాణంతో ఫ‌స్టాఫ్ ముగుస్తుంది. ఓవ‌రాల్‌గా ఫ‌స్టాఫ్ ఎంగేజింగ్‌గానే ఉందంటున్నారు. శ్రీరాముడిగా ప్ర‌భాస్ పాత్ర సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్ అదిరిపోయింది.

అయితే సెకండాఫ్‌లో రావ‌ణుడి పాత్ర చూపించిన తీరు ఎబ్బెట్టుగా అనిపించింది. రావ‌ణుడి సీజీ వ‌ర్క్ కూడా బాగోలేదంటున్నారు. సెకండాఫ్‌లో రామాయ‌ణంలోని మూల‌క‌థ నుంచి ఓం రౌత్ కాస్త సైడ్ ట్రాక్ ఎక్కిన‌ట్టే ఉంద‌ని కంప్లైంట్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో 30 నిమిషాల‌కు పైగా ల్యాగ్ ఉంది. సినిమాలో చాలా సీన్లు గ్రాఫ్ డౌన్ అయిన‌ప్పుడు మ్యూజిక్ ఈ సినిమాను ప్రాణంగా కాపాడింది.

Adipurush pre-release collection: Distribution rights of Prabhas starrer  sold for exorbitant price but the film is yet to break even | Entertainment  News,The Indian Express

పురాణ కథ కావ‌డంతో ప్ర‌భాస్ పాత్ర‌కు స్క్రీన్ స్పేస్ కాస్త త‌గ్గిన‌ట్టు ఉంది. క్లైమాక్స్ యుద్ధంలోని విజువల్స్ కోసం కోట్లాదిరూపాయలు ఖ‌ర్చు చేశారు. అయితే చాలా చోట్ల విజువ‌ల్స్ కార్టూన్ల‌లో ఉంటాయి. ఫ‌స్టాఫ్ అద్భుతంగా తీసిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్ విష‌యంలో ల్యాగ్ చేసి గ్రిప్పింగ్ త‌గ్గించేశాడు. సెకండాఫ్‌లో క్లైమాక్స్ ఒక్క‌టే ఆయువు ప‌ట్టు. ఓవ‌రాల్‌గా ఆదిపురుష్ య‌బో యావ‌రేజ్ అంటున్నారు. పూర్తి టాక్ కొద్ది సేప‌ట్లో రానుంది. సాహో, రాధేశ్యామ్ త‌ర్వాత బాహుబ‌లి రేంజ్ హిట్‌కోసం అంద‌రూ ఎదురు చూసినా ఆ అంచ‌నాలు కాస్త త‌గ్గిన‌ట్టే సినిమా ఉంటుంది.