హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్‌ అలా.. ఏఎన్నార్‌ ఇలా..చివరికి ఇద్దరు చేసింది అదే..!!

బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో హీరోయిన్ల‌కు, ఇప్ప‌టి హీరోయిన్ల‌కు చాలా తేడా ఉంది. ఇప్పుడు అంతా చూపించేస్తున్నారు. అభిన‌యం త‌క్కువ‌.. స్కిన్ షో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తెర‌ల‌పై హీరోయిన్ల అందాలు చూసేందుకు యువత కూడా ఎగ‌బ‌డుతుండ‌డంతో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఆ దారిలోనే న‌డుస్తున్నారు. అయితే, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో స్కిన్ షో లేదు. అంత‌వ‌ర‌కు ఎందుకు.. అస‌లు హీరో హీరోయిన్ల కౌగిలింత‌లు కూడా మ‌న‌కు క‌నిపించ‌వు.

సీన్ డిమాండ్ చేస్తే.. హీరోయిన్ల భుజాల‌ను మాత్రమే హీరోలు తాకేవారు. అది కూడా విత్ ప‌ర్మిష‌న్‌. ఇలాంటి సీన్లు కూడా లేని సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అభిన‌యానికి ఎక్కువ‌గా అవ‌కాశం ఉన్న పాత్ర‌ల్లో సావిత్రి, భానుమ‌తి, అంజ‌లీదేవి, క‌న్నాంబ త‌మ స‌త్తా నిరూపించుకున్నారు. దీంతో బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి వ‌ర‌కు కూడా వీరి పేరు నిలిచిపోయింది. వీరి పేరు చెబితే.. చాలు అమూల్య‌మైన చిత్రాల జాబితా క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది.

ఈ క్ర‌మంలోనే అన్న‌గారు ఎన్టీఆర్‌.. హీరోయిన్ల‌ను దేవ‌త‌లుగా పేర్కొనేవారు. వాస్త‌వానికి ఏ సినిమాలో అయినా.. హీరోకు అగ్ర‌తాంబూలం ఇచ్చేవారు. అయితే.. అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన సినిమాల్లో హీరోయి న్లకు ముఖ్యంగా సావిత్రి, అంజ‌లీదేవి, భానుమ‌తి వంటివారికి అన్న‌గారే ఎక్కువ‌గా గౌర‌వం ఇచ్చేవారు. అంద‌రూ వారిని గౌరవించేలా చూడాల‌నికోరేవారు. దీంతో అన్న‌గారి సినిమా అంటే.. హీరోయిన్లు క్యూ క‌ట్టేవారు.

ఇక‌, ఏఎన్నార్ విష‌యానికి వ‌స్తే.. హీరోయిన్లు మ‌ల్లెమొగ్గ‌లండీ.. అనేవారు. దీనికి కార‌ణం.. అక్కినేని అనేక ప్రేమ క‌థా సినిమాల్లో న‌టించారు. ఆయ‌న స‌ర‌స‌న న‌టించిన వారితో ఆయ‌న ప్రేమాయ‌ణం సాగించారు. దీంతో వారిని అలానే చూసుకున్నారు. అయితే.. ఎప్పుడూ హ‌ద్దులు దాటి ఎరిగింది లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా అన్న‌గారి భావ‌న ఒక‌రకంగా ఉంటే.. అక్కినేని భావ‌న మ‌రోవిధంగా ఉండేది. అంతేకాదు.. అన్న‌గారిని అంద‌రూ ఎన్టీఆర్ గారూ అని పిలిస్తే.. అక్కినేని హీరోయిన్లు మాత్రం ఆయ‌న‌ను హీరోగారూ.. అని పిలిచేవారు.

Tags: Anjali, ANR, celebrities news, latest film news, latest filmy updates, latest news, ntr, savitri, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news