ఒక వ్యూహం+ ఒక పట్టుదల ఉంటే.. ఎలాంటి కార్యక్రమాన్నయినా.. ఎంతగా విజయవంతంగా నిర్వహించ వచ్చో నిరూపించారు.. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గొట్టి పాటి రవి కుమార్. రాష్ట్రంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో యువగళం. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన ఈ యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్.. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే.
నేల నలుచెరగలా .. పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో అత్యంత సునాయాసంగా పార్టీకి విజయం దక్కించాలనే కీలక వ్యూహంతో నారా లోకేష్ అడుగులువేస్తున్నారు. ఈ సమున్నత క్రతువులో ఇప్పటి వరకు సీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలు సహా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఈ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్లు, యువత కూడా ఎంతో శ్రమించారు.
నెల్లూరు నుంచి గుంటూరు వరకు కూడా అంతా చక్కగా పాదయాత్రకు సహకరించారు. అంతేకాదు.. వేల సంఖ్యలో జన సమీకరణ చేశారు. ఎక్కడికక్కడ యువగళాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో నాయ కులు సఫలీకృతం అయ్యారు. అయితే.. ఇతర నియోజకవర్గాల్లో కంటే కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చాలా వ్యూహాత్మకంగా ఒక పట్టుదలతో ఈ పాదయాత్రను నభూతో నభవిష్యతి అన్న విధంగా నిర్వహించారు.
సుమారు 200 ట్రాక్టర్లు, 150కిపైగా కార్లతో పాటు 100 ప్రైవేటు వాహనాలతో నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఎక్కడిక క్కడ భారీ స్వాగత తోరణాలు.. గజమాలలతో నారా లోకేష్‌ను స్వాగతం పలికే కార్యక్రమం నుంచి ప్రజల హాజరు వరకు ఆయన తీసుకున్న శ్రద్ధ.. పాదయాత్రకు మరింత వెలుగు తీసుకువచ్చిందనడంలో సందేహంలేదు. అప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తయితే.. అద్దంకిలో పాదయాత్ర మరో ఎత్తు అన్నట్టుగా ముందుకు సాగింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి ఇద్దరూ కూడా పాదయాత్ర చాలా ప్రెస్టేజ్‌గా తీసుకుని సక్సెస్ చేశారు. అయితే అద్దంకి యువగళం మాత్రం నభూతోః నభవిష్యత్తే అయ్యింది. జగన్ వచ్చే ఎన్నికల్లోనూ గొట్టిపాటి బుజ్జిని ఏ మాత్రం టచ్ చేయలేడన్నది ఈ యాత్రతో క్లారిటీ వచ్చేసింది.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ అన్నట్టుగా.. నేల ఈనిందా.. నింగి వంగిందా!| అన్న డైలాగును అద్దంకిలో నిర్వహించిన పాదయాత్ర మరోసారికళ్లకు కట్టింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. గొట్టిపాటి పిలుపు ప్రంభజనంగా మారి.. పాదయాత్రలో ప్రజలు కిక్కిరిసిపోయారు. అసలు నారా లోకేష్ అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా.. ఇబ్బంది పడేలా.. ప్రజలు వచ్చారంటే.. ఎమ్మెల్యే గొట్టిపాటి ఎంత కసితో తన నియోజకవర్గంల పాదయాత్ర చేశారో తెలుస్తోంది.