అయ్యో పాపం త్రిష.. మూడో సారి మళ్లీ లవ్ లో ఫెయిల్..!

2002లో తెలుగు, తమిళ భాషల్లో తరుణ్ కథానాయకుడిగా తెరకెక్కిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది త్రిష. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా సూపర్ హిట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్నుంచి గత 20 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. సౌత్ లో అందరు అగ్ర నటులతో నటించింది. సినిమాల్లో కెరీర్ పరంగా ఒక వెలుగు వెలిగిన త్రిష వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతోంది.

కొన్నేళ్ల కిందట ఒక తెలుగు అగ్రహీరోతో త్రిష ప్రేమాయణం నడిపింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తను త్రిష లవ్ చేసింది. వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఎందుకనో త్రిష ఆ పెళ్లి రద్దు చేసుకుంది.

కాగా ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన త్రిష మూడోసారి కూడా విఫలం అయినట్లు తెలుస్తోంది. ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన కామెంట్ ఈ అనుమానాలకు తావిస్తోంది. ‘వక్ర బుద్ధి కలిగిన నీ లాంటి వాడితో మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం’ అని త్రిష ఒక పోస్ట్ చేసింది. దీనిని బట్టి త్రిష మళ్లీ ప్రేమలో పడిందని.. ఫెయిల్యూర్ కూడా అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. త్రిష నోరు తెరిస్తే గానీ అసలు నిజం ఏంటో తెలియదు.

Tags: actress trisha, Heroin Trisha Love Affair, tollywood news, Trisha Krishnan