లవ్ అట్ ఫస్ట్ సైట్ పై నమ్మకం లేదు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..!

తను చేసిన మొదటి సినిమా అందాల రాక్షసితోనే ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి కొన్ని హిట్ సినిమాలు మాత్రమే తన ఖాతాలో ఉన్నాయి.లావణ్య త్రిపాఠి ఎక్కువగా యువ హీరోల సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఎందుకనో విజయాలు మాత్రం దక్కడం లేదు.

కాగా కొద్ది రోజులుగా లావణ్య పేరు మీడియాలో మారుమోగుతోంది. వరుణ్ తేజ్ తో ఆమె లవ్ లో ఉందని ఆ వార్తల సారాంశం. ఇటీవలి కాలంలో పలు పార్టీల్లో వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి దర్శనమిచ్చింది. దీంతో వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని ప్రచారం మొదలైంది.కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లావణ్య లవ్ అట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ.. తనకు అలాంటి వాటి పై నమ్మకం లేదని తెలిపింది.

ఒక వ్యక్తి గురించి తెలుసుకోకుండా అతడితో మాట్లాడకుండా ప్రేమ పై ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమని చెప్పారు.ఇక వరుణ్ తేజ్ పై ప్రేమలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా లావణ్య స్పందించింది. వరుణ్ తో రెండు సినిమాలు చేయడం వల్ల ఇలాంటి పుకార్లు వచ్చాయని, తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఇండస్ట్రీలో నిహారిక, రీతూవర్మ, సందీప్ కిషన్, అల్లు శిరీష్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది.

Tags: Actress Lavanya Tripathi, Heroin Love Affair, tollywood news, varun tej