సూపర్ స్టార్ మహేష్ (Mahesh ) అంటేనే అందానికి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు. అమ్మాయిలు కూడా కుళ్లుకునేలా ఆయన అందం ఉంటుంది. వయసు పెరుగుతున్నా కొద్దీ మహేష్ లో అందం ఇంకా పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఎప్పుడూ తన లుక్స్ తో సర్ ప్రైజ్ చేస్తున్న మహేష్ లేటెస్ట్ గా తన డ్యాషింగ్ లుక్ తో అదరగొట్టాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ తన లుక్ ఎలా ఉండబోతుందో లీక్ చేశాడు.
సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపించనున్నాడు. ఇక దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ న్యూ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక మహేష్, త్రివిక్రం కాంబినేషన్ గురించి చూస్తే ఈ కాంబోలో ఇదివరకు ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా వస్తుంది.
ఈ సినిమాలో Mahesh లుక్స్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది. మహేష్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం 2023 ఏప్రిల్ 28న రిలీజ్ కూడా ఫిక్స్ చేశారు.