క‌మ‌ల్ హాస‌న్‌పై సీనియ‌ర్ న‌టి షాకింగ్ కామెంట్స్‌..!

తారలు ఎప్పుడైనా అభిమానుల్లో త‌మ పేరు మార్మోగిపోవాల‌ని చూస్తుంటారు. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌మ‌కు సంబంధించిన కొత్త సినిమా విశేషాలు, ఇత‌ర‌త్రా ఏ అంశాన్ని అయినా షేర్ చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటారు. ఇక వారిలో తెర‌మ‌రుగైన క‌థ‌నాయిక‌లు కూడా తిరిగి లైమ్‌లైట్లోకి రావాల‌ని య‌త్నిస్తుంటారు. అవి కొన్ని వివాదాలు దారి తీస్తాయి. మ‌రికొన్ని కొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తాయి. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌పై సీనియ‌ర్ న‌టి రేఖ చేసిన వ్యాఖ్య‌లు అటు కోలివుడ్‌లోనే కాకా, ఇటు టాలివుడ్‌లోనూ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..

ప్రముఖ సీనియర్ నటి రేఖ ఇటీవల ఓ మీడియా సంస్థ‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా 1986లో బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్‌తో జంట‌గా ఆమె న‌టించిన ‘పున్నగాయ్ మన్నన్’ అనే సినిమా ప్ర‌స్తావ‌కు వ‌చ్చింది. అయితే అందులో కమల్, రేఖ భ‌గ్న ప్రేమికులు క‌నిపిస్తారు. పెద్ద‌లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అలా ఆత్మహత్య చేసుకోబో సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. అదికూడా ఆమె అనుమ‌తి లేకుండా. ఇదే విషయాన్ని రేఖ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన కావాలని చేసింది కాద‌ని, సినిమాలో ముద్దు సీన్ ఉందని వివ‌రించారు. అయితే ఆ విష‌యం త‌న‌కు బాలచందర్, కమల్ హాసన్ చెప్పలేద‌ని వాపోయారు. అదే విష‌యాన్ని బాల‌చంద‌ర్ గారిని అడిగితే ముద్దు సీన్‌లో తప్పేముంది? ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందేన‌ని స‌మ‌ర్థించార‌ని న‌టి రేఖ చెప్పుకొచ్చారు. ఇక ఆ సీన్ త‌రువాత తాను కొన్ని రోజుల పాటు నిద్ర లేని రాత్రులు గ‌డిపాన‌ని, అదో పీడకలలా వెంటాడింది అభివ‌ర్ణించారు. అయితే ఆ ఇంట‌ర్వ్యూ వీడియోను సంగీత్ అనే అమ్మాయి ట్విటర్‌లో షేర్ చేయ‌డంతో తెగ వైర‌ల్ గా మారింది. అటు కోలివుడ్‌, ఇటు టాలివుడ్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది.

Tags: actor kamalhaasan, k balachander, senior actress rekha