Tamannah : ఆ విషయంలో తమన్నాకి ఘోరమైన అవమానం..!

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) వెండి తెర మీద దాదాపు రెండు దశాబ్ధాలుగా మెరుస్తూనే ఉంది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా తమన్నా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించిన తమన్నా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. అయితే అలాంటి అమ్మడికి ఒకచోట మాత్రం చాలా ఘోరమైన అవమానం జరిగింది. ఎన్నో భారీ అంచనాలతో ఆమె చేసిన ఓటీటీ రియాలిటీ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

నేషనల్ వైడ్ గా సూపర్ పాపులర్ అయిన మస్టర్ చెఫ్ ని తెలుగులో తీసుకొచ్చారు. జెమిని టీవీలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షోని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తమన్నా (Tamannah) క్రేజ్ తో బుల్లితెర మీద చాలా మంది రేటింగ్స్ వస్తాయని భావించారు. కానీ ఎందుకో ఆ షో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవలేదు. అంతేకాదు ఆ షో వల్ల తమన్నా ఇమేజ్ కి మరికాస్త డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు.

మాస్టర్ చెఫ్ షో అంతగా సక్సెస్ అవకపోవడంతో ఆమెని తప్పించి అనసూయని హోస్ట్ గా పెట్టారు. తమన్నా ఈ షో విషయంలో లీగల్ కూడా ఇబ్బందులు ఎదుర్కుందని టాక్. మొత్తానికి స్టార్ హీరోయిన్ గా టాలెంట్ చూపించిన తమన్నాకి బుల్లితెర మీద మాత్రం పెద్ద షాక్ జరిగిందని చెప్పొచ్చు.

Tags: Gemini Tv, Master Chef, Star Heroine, Tamanna, Tamannah Bhatia, Tollywood