Brahmaji : అతనిపై కేసు వేసేందుకు రెడీ అయిన బ్రహ్మాజి..!

Brahmaji ready to file case on Netizen

సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ (Brahmaji)కి కోపం వచ్చింది. కెరియర్ మొదట్లో హీరోగానే ప్రయత్నాలు చేసినా ఆడియెన్స్ అతన్ని క్యారక్టర్ ఆర్టిస్ట్ గానే గుర్తించారు. అయితే దాదాపు పాతికేళ్ల ​సినీ కెరియర్ లో ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో సీరియస్ రోల్స్ లో నటించిన బ్రహ్మాజీ ఇప్పుడు కామెడీ రోల్స్ తో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న స్టార్ సినిమాలు అన్నిటిలో బ్రహ్మాజీ ఉంటున్నాడు.

ఎప్పుడూ సరదాగా ఏ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోని బ్రహ్మాజీ (Brahmaji) తనని ఓ నెటిజెన్ అంకుల్ అని పిలిచే సరికి అతను సీరియస్ అయ్యాడు. బ్రహాంజీ ట్విట్టర్ పేజ్ లో అతన్ని అంకుల్ అంటూ ఒకరు సంభోదించాడు దానికి రిప్లై గా బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా.. బాడీ షేమింగా.. కేస్ వేస్తా అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఇదంతా చూసి ఒక యాంకర్ ని ఆంటీ అంటే కోపమొచ్చినట్టుగా బ్రహ్మాజీని కూడా అంకుల్ అంటే కోపం వచ్చిందేమో అనుకునే సరికి చివర్లో స్మైల్ ఎమోజీ పెట్టి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న బర్నింగ్ ఇష్యూ ఆంటీ… ఎవరేమనుకున్నా జరుగుతున్న ఇష్యూ మీద తన మార్క్ సెటైర్ వేసే బ్రహ్మాజీ అంకుల్ అనగానే కేస్ వేస్తా అని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే చివర్లో కామెడీ ఎమోజీ పెట్టగానే ఇదంతా కామెడీనే అనుకుని రిలాక్స్ అయ్యారు ఆడియెన్స్.

 

Tags: Actor Brahmaji, Aunty, Brahmaji, Brahmaji Updates, Netizen, Tollywood, twitter, Uncle