టీడీపీ – జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌కు 50 – 60 వేల మెజార్టీలు.. మైండ్ బ్లోయింగ్ లెక్క‌లు..!

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం – జనసేన పొత్తు అధికారికంగా ఖరారు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగుదేశం పార్టీతో కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడంతో జనసేన ప్రభావం బలంగా ఉన్న చోట రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు తిరుగులేని ఘనవిజయాలు సాధిస్తారు అన్న అంచనాలు అయితే విన‌బడుతున్నాయి.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజకవర్గాలలో ఈ కూటమి చాలా బలమైన కూటమిగా ఉండనుంది. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలలో అయితే రెండు పార్టీల అభ్యర్థులు ఏకంగా 50 నుంచి 60 వేల ఓట్ల భారీ మెజార్టీలతో ఘన విజయాలు సాధించబోతున్నట్టు పలుసర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇంకా చెప్పాలి అంటే లోక్సభ సీట్లకు వచ్చేసరికి రెండు నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని కూడా స్పష్టంగా గ్రౌండ్లో వాతావరణం కనిపిస్తుంది. ఏది ఏమైనా జనసేన – టిడిపి పొత్తు దెబ్బతో వైసిపి కీలక నేతల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్న మాట వాస్తవం. తాము ఓడిపోవ‌డం సంగ‌తి అటు ఉంచితే ఘోర‌మైన ఓట‌మి మూట‌క‌ట్టుకోనున్నారన్న భ‌యం వారిని వెంటాడుతోంది.