శాస‌న‌ మండ‌లి ర‌ద్దుకు ఏపీ కాబినెట్ ఆమోదం..

ఊహించే జ‌రిగింది. గ‌త మూడురోజులుగా ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాలే నిజ‌మ‌ని తేలింది. ఉత్కంఠ‌త వీడింది. శాస‌న మండ‌లి ర‌ద్దుకు ఏపీ కెబినెట్ ముక్త‌కంఠంతో ఆమోదించింది. ఇక ఆ బిల్లును అసెంబ్లీను పెట్ట‌డ‌మే త‌రువాయిగా మిగిలింది.
వైసీపీ అసెంబ్లీలో ఆమోందించిన రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు బిల్లుల‌ను శాస‌న మండ‌లిలో టీడీపీ అడ్డుకున్న‌ది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించి రూల్ 71 ను ముందుకు తీసుకురావ‌డంతో ఆ బిల్లులు మండ‌లికి చేర‌క‌ముందే సెల‌క్ట్ క‌మిటీ చేతికి చేరాయి. ఊహించ‌ని ప‌రాభ‌వాన్ని త‌ట్టుకోలేక వైసీపీ నేత ప్ర‌స్త‌తు బిల్లుల ఆమోద‌మే గాక‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా ఏకంగా శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఏపీలో రాజ‌కీయా వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడేక్కింది.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌కంగా శాస‌న మండ‌లి ర‌ద్దు అంశంపై చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. ఏ నిర్ణయం అమలు చేయాలనుకుంటోందో అదే దిశగా ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ది. శాసన మండలిని రద్దు తీర్మాణాన్ని కేబినెట్ స‌మావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్ట‌గా, దానిని మంత్రులంతా ఆమోదించారు. దాంతో ఇవాళ్టి అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చించేందుకు మరింత అనువైన అవకాశాలు లభించాయి. మండలి రద్దు బిల్లును ఇక్క‌డ ఆమోదింప జేసుకోని ఆ తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపనుంది. కేంద్రం ఉభయ సభల్లో బిల్లు ప్రతిపాదనను ఆమోదిస్తే… మండలి రద్దయ్యే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండ‌గా.. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టీడీపీ సభ్యులు వచ్చినా, రాకపోయినా బిల్లు ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించే అవకాశాలున్నాయ‌ని తెలుస్తున్న‌ది.

Tags: ap cabinet meeting, cm jagan, ex cm chandrababu