కాకినాడలో జనసేన, వైసీపీ కార్యకర్తల బాహాబాహి

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బాహాబాహికి దిగారు. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. రాళ్లతో దాడికి దిగగా వైసీపీ నేతలపై పత్రి దాడులకు దిగారు. దీంతో పట్టనంలో ఉద్రిక్తత నెలకొంది. అసలు విషయమేమిటంటే.. ఏపీకి మూడురాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా కాకినాడలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం భారీ ప్రదర్శనను నిర్వహించారు.

 

ఈ కార్యమ్రానికి నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలను చేశారు. ”చంద్రబాబును తిట్టాలి ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మళ్లీ లేకుండా కొట్టాలి ఉంది. లోకేష్‌ కొవ్వు కరిగిలే బుద్ధి చెప్పాలని ఉంది” పరుష పదజాలంతో దూషించారు. అదేవిధంగా పవన్‌పై సైతం విరుచుకుపడ్డారు. ఏకవాఖ్య సంబోధనతో ” చంద్రబాబు చెప్పినట్లు నడిచే వాడివి నువ్వు. నువ్వూ ఒక నాయకుడివా ” అంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ద్వారంపూడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.

 

ఇదిలా ఉండగా పవన్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. దీనిని ఖండిస్తూ కాకినాడ భానుగుడి సెంటర్‌లో నిరసన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. పోలీసులు కొందరిని అడ్డుకోగా, మరికొందరు తప్పించుకుని ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న వైసీపీ నేతలు జనసేన పార్టీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Tags: chadrababu, kakinada mla dwarampudi chandrashekar, pawankalyan