అల వైకుంఠపురంలో.. కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. డాషింగ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో అల వైకుంఠపురంలో చిత్రం ఊహించిన విధంగానే రికార్డులను తిరగరాస్తున్నది. మ్యూజిక్‌తో ఆకుట్టుకుంటూనే భారీ కలెక్షన్లను రాబట్టుతున్నది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నది. అంచనాలను మించి సినిమా విడుదలైన మొదటి రోజే భారీ కలెక్షన్లను రాబట్టింది. ఒక రోజు ముందే విడుదలై రికార్డులను తిరిగరాస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాకు గట్టి పోటీనిస్తున్నది. ఆ సినిమా ప్రభావం ఉంటుందోమోనని అలవైకుంఠపురంలో దర్శకనిర్మాతలు ఆందోళన చెందినా వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ దూసుకెళ్తున్నది. తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సిస్‌లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబబుతున్నది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ, బాహుబలి కలెక్షన్లను మించి పోయిందని టాక్‌.

ప్రాథమిక అంచనా ప్రకారం సినిమా విడుదలైన మొదటి రోజే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 19కోట్ల రూపాయాలను రాబట్టిందని తెలుస్తున్నది. అది ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల వివరాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తంగా రూ. 20కోట్ల కలెక్షన్లకు మించి ఉంటుందని సినిమా పండితులు వివరిస్తున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను బట్టి చూస్తే ఆ మొత్తం రూ. 28 కోట్లకు మించిపోతుందని సమాచారం.

కలెక్షన్ల పరంగా గత రికార్డులను బ్రేక్‌ చేస్తున్నది. ఒక రోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్లను రాబట్టి బాహుబలి రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా ఆ రెండు సినిమాల రికార్డులను బ్రేక్‌ చేస్తున్నది. అమెరికాలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 476546 డాలర్లను కొల్లగొట్టింది. అంతుకు ముందుకు సరిలేరు నీకెవ్వరు సినిమా 251473, దర్బార్‌ 152230 డాలర్లను మాత్రమే సాధించడం గమనార్హం. అదే విధంగా న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు మరే తెలుగు సినిమా సాధించని కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తున్నది. అక్కడ మూడు ప్రాంతాల్లో ఐదు షోలలో 34, 625 డాలర్లను రికార్డు స్థాయిలో వసూలు చేసింది. ఆ ప్రాంతంలో బాహుబలి కేవలం 21290 డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ఇప్పటివరకు ఆ రికార్డు ఉండగా దానిని అలవైకుంఠపురంలో బ్రేక్‌ చేసింది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా మరిన్నె రికార్డులను నెలకొల్పనున్నదో?

Tags: Ala Vykuntapuramulo, allu arjun, first day collections, trivikram