“పుష్ప” మూవీలో భన్వర్ సింగ్ షేకావత్ రోల్ లో .. నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు యూత్ ఐకాన్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మంద‌న కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సంపాదించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పటివరకు సౌత్ లో మాత్రమే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవ‌ల్ లో వచ్చిన పుష్ప సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ వచ్చింది.

Pushpa 2: Allu Arjun to face two villains in the sequel? Sukumar ropes in  THIS popular actor for second antagonist – deets inside

ఈ సినిమాలో విలన్ రోల్ ను పోషించిన ఫ‌హద్ ఫాజిల్ కు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో అల్లు అర్జున్ కి ఫ‌హ‌ద్ ఫాజిల్ మధ్యన స్ట్రాంగ్ వార్ మొదలవుతుంది. ఆ వారే ఎలా కొనసాగుతుంది అనేది పుష్ప 2 సినిమాలో తెలియనుంది. అయితే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో భన్వ‌ర్ సింగ్ షేకావత్ పాత్ర కోసం ముందుగా ఫ‌హద్ ఫాజిల్ కంటే ముందు సౌత్ స్టార్ హీరో అయినా విజయ్ సేతుపతిని అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్.

Vijay Sethupathi News: Vijay Sethupathi's drastic weight loss stuns fans,  see pics - The Economic Times

కానీ అప్పటికే విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ పాత్ర ఫాజిల్ చేతికి వెళ్ళింది. ఈ సినిమాతో ఫ‌హద్ ఫాజిల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 పైన అంచనాలు పెరిగిపోయాయి. అల్లుఅర్జున్ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్ష‌కులు పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.