విడాకుల వ‌ర‌కు వెళ్లిన హీరోయిన్ రంభ సంసారం చ‌క్క‌దిద్దిన స్టార్ హీరో ఎవ‌రంటే…!

విజ‌య‌వాడ‌కు చెందిన విజ‌య‌ల‌క్ష్మి కాస్తా సినిమాల్లోకి వ‌చ్చాక రంభ‌గా మారిపోయింది. మ‌న‌కు రంభ అంటే కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కావ‌చ్చు.. ఆమె స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించింది అని మ‌నం స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ భోజ్‌పురి సినీ ప్రేక్ష‌కుల‌కు రంభ ఓ ఆరాధ్య దేవ‌త‌.. రంభ అంటే అక్క‌డ ప్రాణాలు ఇచ్చే అభిమానులు అప్ప‌ట్లో ఉండేవాళ్లు. తెలుగులో ఓ వెలుగు వెలిగిన రంభ ఎప్పుడు అయితే భోజ్‌పురి భాష‌లోకి ఎంట‌ర్ అయ్యిందో ఐదారేళ్ల పాటు ఆ సినిమా ఇండ‌స్ట్రీని ఏలేసింది.

Bombai Priyudu - Balamurali krishna Song Lyrics - Telugu Movie Lyrics

 

భోజ్‌పురిలో న‌గ్మా త‌ర్వాత ఆ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన హీరోయిన్ రంభే. భోజ్‌పురిలో ర‌వికిష‌న్‌సింగ్‌, మ‌నోజ్ తివారి ఇద్ద‌రూ కూడా రంభే కావాల‌ని రిక‌మెండ్ చేయించుకుని మ‌రీ ఆమెతోనే ఎక్కువుగా సినిమాలు చేసేవారు. ఇప్ప‌ట‌కీ భోజ్‌ఫురి వాళ్లు రంభ‌ను బాగా గుర్తు పెట్టుకున్నారంటేనే ఆమె అక్క‌డ ప్రేక్ష‌కుల‌తో పాటు ఆ ఇండ‌స్ట్రీలో ఎలాంటి ముద్ర వేసిందో అర్థ‌మ‌వుతోంది.

ఇక కెనడాకు చెందిన ఎన్నారై ఇంద్ర‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న రంభ కెనడాలోనే కాపురం పెట్టింది. ప్ర‌స్తుతం ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట‌ర్ అయ్యాక రంభ కాపురం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. 2010లో వీరి వివాహం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఐదారేళ్ల పాటు వీరి కాపురం బాగానే ఉంది. త‌ర్వాత భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో రంభ విడాకులు తీసేసుకుంటానంటూ ప‌ట్టుబ‌ట్టింది.

Here's how Rambha and Indhran Pathmanatha are celebrating their 10th wedding anniversary | Telugu Movie News - Times of India

అయితే వీరి మ‌ధ్య జ‌రిగింది చిన్న‌గొడ‌వ‌.. ఇంద్ర‌కుమార్ కూల్ ప‌ర్స‌న్ అయినా.. రంభే పంతానికి పోవ‌డంతో చివ‌ర‌కు వీరు విడాకులు తీసుకోవాల‌ని అనుకున్నారు. అయితే రంభతో ద‌ర్శ‌కేంద్రుడు కె.. రాఘ‌వేంద్ర‌రావు బొంబాయి ప్రియుడు సినిమా చేశారు. ఆ సినిమాలో జేడీ చ‌క్ర‌వ‌ర్తి హీరోగా న‌టించారు. ఆ సినిమా టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న చిలిపి త‌గాదాలు న‌డిచేవి. అలా మంచి స్నేహితులు అయ్యారు.

రంభ భ‌ర్త‌తో విడిపోతుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో అటు రాఘ‌వేంద్ర‌రావుతో పాటు ఇటు ఆమెతో ఎంతో స్నేహంగా ఉండే జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఇద్ద‌రూ కూడా ఆమెతో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడార‌ట‌. అయితే చిన్న విష‌యానికే వారిద్ద‌రు పంతానికి పోయార‌ని.. అందులోనూ రంభ త‌ప్పే ఎక్కువ ఉంద‌ని తేల‌డంతో ఆమెను క‌న్విన్స్ చేశార‌ట‌. భ‌ర్త‌తో విడిపోతే జీవితంలో ఎలాంటి ? ఇబ్బందులు వ‌స్తాయో ? చెప్పార‌ట‌. అలా రంభ సంసారం నిల‌బ‌డింది.

బొంబాయి ప్రియుడు సెట్స్ లో రంభ ఎందుకు ఏడ్చిందో తెలుసా | Why Rambha Cried In The Sets Of Bombai Priyudu Details, Director Raghavendra Rao, Bombai Priyudu Movie, Rambha Crided, Hero Jd, Heorine Rambha, Furits

ఇక రంభ ఇప్పుడు టాలీవుడ్‌లో స‌రైన పాత్ర‌లు ప‌డితే రీ ఎంట్రీ ఇవ్వాల‌న్న ప్లానింగ్‌లో ఉంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సైతం త‌న బెస్ట్ ఫ్రెండ్ అయిన జేడీ చ‌క్ర‌వ‌ర్తిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అత‌డు అన్నీ అబ‌ద్ధాలే చెపుతూ ఆట‌ప‌ట్టిస్తూ ఉంటాడ‌ని.. అత‌డు నా పెళ్లికి రాక‌పోవ‌డం బాధ క‌లిగించిందంటూ జేడీపై త‌న‌కు ఉన్న ప్రేమ చాటిచెప్పింది.