మ‌ళ్లీ చిరు వర్సెస్ బాలయ్య… ఈ సారి రవితేజ కూడా సై అంటున్నాడే..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో భారీ సినిమాలే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో బాల‌య్య‌- చిరు న‌టించిన వీర‌సింహ‌రెడ్డి, వాల్తేరు వీర‌య్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యాన‌ర్‌లో వ‌చ్చాయి. ఇక హీరోయిన్‌గా ఈ రెండు సినిమాలో శ్రుతి హ‌సన్‌ న‌టించింది. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో 230 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాయి.

Chiranjeevi – Bhola Shankar: Chiranjeevi's new poster from 'Bhola Shankar'..  Megastar in cab driver avatar..

ఇక ఇప్పుడు చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్‌తో భోళా శంక‌ర్ చేస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా ఆగష్టు 11న‌ రిలీజ్ చేయ్య‌ల‌ని భావించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాపై మ‌రో వార్త వైర‌ల్‌గా మ‌రింది. ఈ సినిమాలోని చాలా సీన్లు పెండింగ్ లో ఉన్నాయని అందుకు ఈ సినిమాను ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో చిరంజీవి, బాలయ్య మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ‌నున్నారు.

Nandamuri Balakrishna Announces His Next Movie With F3 Filmmaker Anil  Ravipudi

 

అంటే ద‌స‌రాకు చిరు భోళా శంకర్, బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో పాటు, ర‌వితేజ న‌టిస్తున్న‌టైగర్ నాగేశ్వరరావు కూడా బాక్సాఫీస్ వార్‌లో నిల‌వ‌నుంది. ఈ మూడు సినిమాల బడ్జెట్లు రూ. 300 కోట్ల రూపాయల రేంజ్ కావ‌డం గమనార్హం. భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవాల‌ని చూస్తున్నాడు. మరోవైపు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతు మ‌రో హిట్ కోసం చూస్తున్నాడు.

Tiger Nageswara Rao first look video out, Ravi Teja instills fear as  'India's biggest thief'. Watch - India Today

ర‌వితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వంశీ డైరెక్షన్. స్టూవ‌ర్ట్‌పురం దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు కెరీర్ బ‌యోపిక్‌గా ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా కూడా గూస్ బంప్స్ తేప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి సంక్రాంతి పోటీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.మ‌రి మూడు సినిమాలో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి.