పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌తో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాడని అందరూ అనుకుంటున్న సమయంలో పవన్ ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు . వీరిద్దరూ ముందుగా ప్రకటించినట్లుగా భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్‌లో పని చేయనున్నారు.
హరీష్ శంకర్‌తో సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. డిసెంబర్ చివరి భాగంలో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ప్రారంభించబడుతుంది మరియు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈ ప్రాజెక్ట్ కొద్దిరోజులు తర్వాత షూట్ ప్రారంభమవుతుంది.ఇది చాల వేగంతో చుట్టబడుతుంది. ఇది 2023 ఆఖరిలో విడుదలకు సిద్ధంగా ఉండొచ్చు.