ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ భారతీయుడు 2లో కనిపించనున్నారు. కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో కిక్‌స్టార్ట్ చేయడానికి డేట్ కూడా లాక్ చేయబడింది.
ఈరోజు కమల్ హాసన్ జ్వరం లక్షణాలతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. కమల్ శ్వాసకోశ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం 68 ఏళ్ల నటుడి పరిస్థితిని వైద్యుల బృందం పరిశీలిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో అప్‌డేట్ ఇస్తామని డాక్టర్స్ చెబుతున్నారు.నిన్న హైదరాబాద్‌లో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిని కమల్ కలిశారు.