వామ్మో..ఆ విషయంలో ఇద్దరు మహా ముదురులే.. వీళ్ళ మధ్య ఉన్న ఈ విచిత్రమైన పోలిక గురించి తెలిస్తే మైండ్ బ్లాకే..!

బాలీవుడ్ లో సావిత్రి తర్వాత మహానటి అనే బిరుదుని దివంగత నటి శ్రీదేవి మాత్రమే సంపాదించుకోగలిగింది. అతిలోకసుందరి అని కూడా శ్రీదేవిని పిలుస్తారు. ఆమె అందం అభినయంతో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కోట్లాది మంది అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. స్టార్ హీరోల పక్కన కూడా ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.

ఆమె అందం చివ‌రి వరకు కూడా అలానే ఉంది. శ్రీదేవి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్,క‌న్న‌డ‌ ఇలా ఇండియా లో అన్ని భాషల్లోనూ నటించింది.ఇక రేణు దేశాయ్ ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బద్రి సినిమాలో సూపర్ హిట్ సాధించి.. ఆ సినిమా షూటింగ్ టైంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి.. పిల్ల‌లు పుట్టిన కొన్నేళ్ల‌కు వివాహం చేసుకుంది.

ఈమెకు అకిరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంత‌కి రేణు దేశాయ్‌కు, శ్రీదేవికి మధ్యన పోలిక ఏంటంటే ఇద్దరు పెళ్లి కాకముందే గర్భం దాల్చారు. శ్రీదేవి ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన బోనికపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాల‌లో స్టార్ హీరోయిన్గా ఉంది.

ఆమె ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాతోనే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఇక రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తో సహజీవనం తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకుని ఎవ‌రి జీవితాన్ని వారు గడుపుతున్నారు.

Tags: Bollywood, bollywood news, film news, filmy updates, latest news, latest viral news, Renudesai, social media, social media post, sri devi, trendy news, viral news