ద‌ద్ద‌మ్మ‌లైన తెలుగు హీరోల కంటే విశాల్ న‌యం… బాబు అరెస్టు త‌ప్ప‌ని ఒక్క ముక్క‌లో చెప్పాడు..!

నిజంగా మన తెలుగు హీరోలు తెరమీద మాత్రమే కత్తులు, కర్రలు పట్టుకుని ఫైట్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో వీళ్ళు జీరోలు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళను ప్రత్యేకంగా గౌరవంగా చూసేవారు. వాళ్లతో మనకు ఎందుకు వాళ్ళ జోలికి వెళితే వాళ్ళ అభిమానుల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న భయం వారికి ఉండేది. ఇక ఎన్టీఆర్ స్వతహాగా సినీ నటుడు కావడంతో ఆయన వాళ్ళను గౌరవంగా చూసుకున్నారు. కొందరికి పదవులు కూడా కట్టబెట్టారు.

చంద్రబాబు కూడా సినీ రంగంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సినిమా వాళ్లు హీరోలు కాదు వీళ్ళు జీరోలు అని ప్రూవ్ చేసిన ఘనత కచ్చితంగా కేసీఆర్ కే దక్కుతుంది. కేసీఆర్ దెబ్బతో హైదరాబాదులో ఉన్న ఏ ఒక్క సినీ హీరో కూడా నోరు మెదిపే పరిస్థితి లేదు. తేడా వస్తే నాగార్జున ఎన్ కన్వెన్షన్ గోడ కూల్చేందుకు వెళ్లిన బుల్డోజర్లు ఎలా ఆగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసీఆర్ దెబ్బతో ఏ సినిమా హీరో కూడా కిక్కురు మనటం లేదు. కేసిఆర్ సినిమా హీరోలను జీరోలను చేయటం చూసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం సినిమా వాళ్ళను ప్రత్యేకంగా తన దగ్గరకు రప్పించుకున్నారు.

ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో సినిమా ఇండస్ట్రీ ఎన్ని ఇబ్బందులకు గురవుతుందో చూస్తూనే ఉన్నాం. టిక్కెట్ రేట్లు త‌గ్గించిన జ‌గ‌న్ సినిమా వాళ్ల‌ను ఓ ఆటాడుకున్నాడు. చివరకు తాము పెద్ద హీరోలం అని చెప్పుకునే వాళ్ళు కూడా జగన్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని ఎలా వినమ్రంగా వేడుకున్నారో చెప్పక్కర్లేదు తాజాగా చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ నుంచి చంద్రబాబుతో బాగా అనుబంధం ఉన్న ఇద్దరు ముగ్గురు మినహా ఎవరు స్పందించలేదు. నిర్మాత అశ్వినీద‌త్ – కే రాఘవేంద్రరావు లాంటివారు తప్ప ఏ హీరో కూడా స్పందించలేదు.

ఇక నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు ఎలాగూ బాబా కావడంతో ఆయన గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవంగా తెలుగు సినిమా రంగానికి హీరోలకు చంద్రబాబు ఎంతో మేలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా విశాఖ‌ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేశారు. అవన్నీ ఏ ఒక్క తెలుగు హీరోకు.. తెలుగు నిర్మాతకు టాలీవుడ్ బడా బడా మనిషులకు పట్టలేదు. చివరకు గతంలో చంద్రబాబు దయతో రామానాయుడు ఎంపీగా గెలిచారు. ఈరోజు ఆయన తనయుడు సురేష్ బాబు చంద్రబాబు నుంచి ఎంతో లబ్ధి పొంది కూడా ఆయన అరెస్టుపై గోడమీద పిల్లి వాటంగా మాట్లాడారు.

మన తెలుగు హీరోలు ఎంత దద్దమ్మలో మరొకసారి ప్రూవ్ అయింది. చివరకు నందమూరి వంశానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడంతో పాటు జనసేన అధినేతగా ఇప్పటికే చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. పవన్ – బాలయ్య లాంటి వాళ్ళను పక్కన పెడితే మిగిలిన స్టార్ హీరోలుగా చెప్పుకుంటున్న వారిలో ఏ ఒక్కరు చంద్రబాబు అరెస్టుపై స్పందించిందుకే ఇష్టపడటం లేదు.

ఇలాంటి టైంలో తెలుగువాడు అయినా తమిళంలో స్టార్ హీరోలుగా ఉన్న విశాల్ రెడ్డి జగన్ తీరు త‌ప్పు ప‌ట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండించారు. ఆయనను అరెస్టు చేసే ముందు పక్కా ఆధారాలు సేకరించి ఆ తర్వాత అరెస్టు చేసి ఉంటే బాగుండేదని.. తన మనసులో ఉన్న మాట కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబును అలా అరెస్టు చేసిన తీరు బాధాకరంగా ఉందని కూడా చెప్పారు. ఏది ఏమైనా విశాల్‌ అంత ధైర్యంగా మాట్లాడటం నిజంగా అతడికి ఉన్న గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పైగా విశాల్ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభిమాని కావటం విశేషం.

విశాల్ గతంలో వైసిపి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నాడని.. పైగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఆయనపై పోటీ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. అలాంటి విశాల్‌ ఈరోజు జగన్ చేసిన పనిని తప్పని ధైర్యంగా ఖండించడం ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక తెలుగుదేశం శ్రేణులు అయితే విశాల్ రియల్ హీరో అని కీర్తిస్తున్నాయి. మన తెలుగు హీరోలు ఎంత దద్దమ్మలు అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీతో లబ్ధి పొందిన హీరోలు మాత్రమే కాదు నందమూరి కుటుంబంలో హీరోలు కూడా పిల్లి మాదిరిగా పాలు తాగుతూ ఉన్నారే తప్ప చంద్రబాబు అరెస్టుపై ఒక ముక్క మాట్లాడితే తమకు ఏం అవుతుందో అన్న భయంతో ఉన్నారు. ఇలాంటి టైంలో విశాల్‌ తన డేరింగ్ కౌంటర్లతో నిజంగా రియల్ హీరోగా నిలిచిపోయాడ‌నే చెప్పాలి.