Unstoppable 2 : ఆహా వేదికపై బాల చంద్రులు.. అన్ స్టాపబుల్ 2 ప్రోమో వచ్చేసిందోచ్..!

Unstoppable 2 : ఆహా ఓటీటీలో సూపర్ హిట్ టాక్ షోగా వస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి రెడీ అయ్యింది. నందమూరి నట సిం హం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షో చాలా క్రేజీగ ఉంది. సీజన్ 2 మొదటి ఎపిసొడ్ సెన్సేషనల్ కానుంది. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యారు. దీనికి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు ఆహా టీం. బాల చంద్రులు ఇద్దరు ఒకే వేదిక మీద అది కూడా ఒక టాక్ షోలో రావడం తెలుగు తమ్ముళ్లకి కన్నుల పండగగా మారింది.

బాలకృష్ణ, చంద్రబాబు కలిసి చేసిన ఈ స్పెషల్ చిట్ చాట్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుందని చెప్పొచ్చు. చంద్రబాబు లోని రొమాంటిక్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బాలయ్య. ఇక బాలయ్య బాబు ఎనర్జీ మాత్రం అదే రేంజ్ లో ఉంది.

బాలయ్య అన్ స్టాపబుల్ 2 తప్పకుండా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. సినిమాలతో పాటుగా రియాలిటీ షోస్ తో కూడా బాలయ్య కుమ్మేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే బాలయ్య వల్ల అన్ స్టాపబుల్ షోకి సెన్సేషనల్ క్రేజ్ ఏర్పడింది.

//////////////////////////////////////////////////////////////

Tags: Aha OTT, Aha Video, Bala krishna, chandra babu, Unstoppable 2