Chiranjeevi : వాళ్తేర్ వీరయ్య మెగా ఫ్యాన్స్ కి పండుగే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది. చిరుని ఎలా స్టైలిష్ గా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు డైరక్టర్ మోహన్ రాజా. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వాళ్తేర్ వీరయ్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు మాస్ లుక్ తో కనిపించనున్నారు.

సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది. లీకైన ఫోటోలో చిరంజీవి మాస్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి ఈ మూవీ సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని లీకైన మెగాస్టార్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈమధ్య చిరు రీమేక్ సినిమాలనే చేస్తుండగా బాబీ డైరక్షన్ లో ఒరిజినల్ కథతో వాళ్తేర్ వీరయ్య సినిమా చేస్తున్నాడు.

వాళ్తేర్ వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ అందించేలా ఉంటుందని చెప్పొచ్చు.

Tags: chiranjeevi, KS Ravindra, Megastar Chiranjeevi, Mytri Movie Makers, Tollywood