#BoycottMaruthi : టాలీవుడ్ కి పాకిన బాయ్ కాట్ ట్రెండ్.. ఆ డైరక్టర్ తో ప్రభాస్ సినిమా వద్దని ఫ్యాన్స్ గొడవ..!

ఈమధ్య బాలీవుడ్ సినిమాలకు బాయ్ కాట్ (#BoycottMaruthi) సెగ బాగానే తగిలింది. హిందీ ఆడియెన్స్ కొందరు బాయ్ కాట్ బాలీవుడ్ అనే ట్విట్టర్ ట్రెండ్ ని లేవనెత్తారు. ఇక సినిమాల టాక్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో సినిమాలు బాయ్ కాట్ కి బలవుతున్నాయని భావించారు. ఇదిలాఉంటే ఇప్పుడు ఆ బాయ్ కాట్ ట్రెండ్ టాలీవుడ్ కి పాకింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

యువి క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ మూవీ నిర్మిస్తుంది. ఈ సినిమా చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏమాత్రం ఇష్టం లేదు. మారుతి డైరక్షన్ లో ప్రభాస్ సినిమా చేయవద్దని బాయ్ కాట్ మారుతి (#BoycottMaruthi)హ్యాష్ ట్యాగ్ ని ట్రోల్ చేస్తున్నారు. తమ హీరో ఎవరితో సినిమా చేయాలి ఎవరితో చేయకూడదు అన్నది కూడా ఫ్యాస్ డిసైడ్ చేసే స్టేజ్ కి ఫేవరిజం వెళ్లింది.

మారుతి డైరక్షన్ లో ప్రభాస్ సినిమాని కాదనడానికి మారుతి ఇంకా స్టార్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకోలేదని ఈ టైం లో కెరియర్ రిస్క్ లో పెట్టడం ఎందుకని ప్రభాస్ ఫ్యాన్స్ అభ్యర్ధన. అయితే ఆల్రెడీ సినిమా ఫిక్స్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎన్ని బాయ్ కాట్ లు చేసినా వేస్ట్ అని చెప్పొచ్చు.

Tags: Boyacott Trend, Boycott Maruthi, Maruthi, Prabhas, Prabhas Fans, Tollywood