ఫ్యాన్స్ కి ఊహించని సప్రైజ్ ఇచ్చిన రౌడీ స్టార్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది.ఈ సినిమా హిందీ తోపాటు తెలుగు ఇతర భాషల్లో ఒకే రోజు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో నటించిన సినిమా విడుదల కావడంతో ప్రేక్షకులు భారీగా థియేటర్ల వద్ద కు వస్తున్నారు.

ఇక విజయ్ అభిమానులు థియేటర్ల వద్ద కటౌట్లు కట్టి.. బాణసంచా పేల్చి సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండేతో కలసి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో సందడి చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఉన్నట్టుండి తమ అభిమాన హీరో థియేటర్లో కనిపించడంతో ఫ్యాన్స్ విజయ్ కి జేజేలు పలికారు.

అభిమానులకు అభివాదం చేసిన విజయ్.. ఆ తర్వాత వారితో కలసి సినిమా చూశారు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. ఒక కీలక పాత్రలో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ నటించారు. ఈ సినిమా విడుదలై కొన్ని గంటలు కాగా అప్పుడే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ రివ్యూ తెలుపుతున్నారు. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమాకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Tags: ananya pandey, charmykaur, director puri jagannath, liger, Vijay Devarakonda