సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న అంజలి..అక్కడే కాపురం పెట్టేసిందా?

Anjali

చాలా మంది హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా అన్నీ కానిస్తూ, పెళ్ళి కూడా చేసుకుంటున్నారు..తర్వాత బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలుస్తున్నారు..మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. అందులో సౌత్ హీరోయిన్లు శృతి హాసన్, ఇలియాన పేర్లు వినిపించాయి.ఇప్పుడు మరో హీరోయిన్ అంజలి (Anjali) లిస్ట్ లోకి చేరింది..తెలుగు అమ్మాయి అయినా తమిళంలో తిరుగు లేని హీరోయిన్గా చలామణి అవుతోంది నటి అంజలి. మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. అయితే అంజలి విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయింది..

అంజలి ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అమ్మాయి.. రాజోలు ఆడపడుచు అయిన అంజలి ముందుగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అవడంతో అంజలికి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా హిట్ సినిమాల్లో నటించింది.
Anjali

సీనియర్ హీరోలు బాలయ్య ,వెంకటేష్ కు కూడా అంజలి జోడిగా నటించి మెప్పించింది. ఇటు కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేసింది. అటు కోలీవుడ్‌లోనూ సీనియర్ హీరోల పక్కన ఆడిపడింది. సింగం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. హీరోయిన్‌గా ఎంత మంచి గుర్తింపు వచ్చినా అంజలి కొన్ని కాంట్రవర్సీల్లో చిక్కుకొని హైదరాబాద్‌కు మకాం మార్చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మధ్య మధ్యలో ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది.

అయితే అంజలి తమిళ నటుడు జై(Jai) తో ప్రేమాయణం నడపడంతో పాటు.. సహజీవనం కూడా చేసింది. వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. ఏమైందో కానీ సడన్గా వీరిద్దరూ విడిపోయారు. జైతో విడిపోయాక అంజలి టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ రైటర్‌తో సహజీవనం చేస్తున్నట్టు పుకార్లు వినిపించాయి. తాజాగా అంజలి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో మొగుడుతో కలిసి గుట్టుగా కాపురం చేస్తుందన్న రూమర్లు బయటికి వచ్చాయి.
Anjali-Jai

అయితే ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో మీడియాతో మాట్లాడిన అంజలి తాను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానని వచ్చిన వార్తలను ఖండించారు. అవన్నీ పుకార్లే అని చెప్పిన ఆమె.. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చేసింది. తాను పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు అందరికి చెప్పి చేసుకుంటాను అని చెప్పింది..వకీల్ సాబ్ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదని తెలుస్తుంది.

Tags: Anjali, Jai, Tollywood actress