టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫ‌స్ట్ లుక్‌.. పులిని వేటాడే పులి ( వీడియో)

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గ‌త యేడాదిన్న‌ర కాలంలో ర‌వితేజ నుంచి చాలా సినిమాలు వ‌స్తున్నాయి. రామారావు ఆన్‌డ్యూటీ, ఖిలాడీ, ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య‌, రావ‌ణాసుర వ‌చ్చాయి. ఇక త్వ‌ర‌లోనే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా అక్టోబ‌ర్ 20న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ర‌వితేజ హీరోగా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై ట్రేడ్ స‌ర్కిల్స్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. నుపుర్ సనన్ – గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి హావ్ లాక్ బ్రిడ్జి మీద గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లువురు స్టార్ హీరోలు దీనిని డిజిట‌ల్‌గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఫ‌స్ట్ లుక్ విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌లో వెంక‌టేష్ వాయిస్ అయితే అదిరిపోయింది. 1970 ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన గుంటూరు జిల్లా బాప‌ట్ల తాలూకాలోని స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ చాలా గ్రాండ్‌గా ఉంది.

ఈ ఈ పవర్ఫుల్ లుక్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకోవ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ మోష‌న‌ల్ పోస్ట‌ర్ లుక్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి.