తొలిప్రేమ ‘ లాంటి క్లాసిక్ లవ్ స్టోరికి పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తొలిప్రేమ. 1998లో ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటిలో ఓ ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ లవ్ స్టోరిగా మిగిలి పోయింది. ఈ సినిమా రీలీజ్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరలు పూర్తివుతున్నా ఈ సినిమాను ఇప్పటికి టీవిలో వస్తుంటే అతుక్కుపోయి చూస్తుంటారు. ఈ సినిమా ఈతరం వారికి కూడా అంతా గోప్పగా కనెక్ట్ అవుతుంది తొలిప్రేమ. ఈ సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి అవ్యడంతో తొలిప్రేమను రీరిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నెల 30న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత జి. వి. జి రాజు ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నడు. మరికొన్ని సినిమాలకు పవన్ రెమ్యునరేషన్ రూ. 60 కోట్లు పైనే ఉంటుంది. తొలిప్రేమ సినిమా కోసం పవన్ లక్షలోనే రెమ్యునరేషన్ తీసుకున్నాడాని నిర్మాత చెప్పుకొచ్చాడు.
అయితే పవన్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాము నేను చెప్పనని.. ఈ సినిమా ఓకే అయ్యాక తాను ఎంత ఇస్తాను అని ఓ అమౌంట్ చెప్పిన వెంటనే పవన్ ఓకే చెప్పినట్టు రాజు గుర్తుచేసుకున్నారు. సినిమా పూర్తియన తర్వాత ఆ అమౌంట్ ఇవ్వాలా ? ముందు ఇవ్వాలా అంటే మీ ఇష్టం తర్వాత ఇవ్యండి అంటూ అయన అన్నడాని రాజు గుర్తుచేసుకున్నారు. అయితే ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి తర్వాత సినిమా పూర్తి అయ్యక మిగిలిన అమౌంట్ ఇచ్చినట్లు రాజు తెలిపారు
పవన్ నెల ఖర్చుల కోసం కొంత అడ్వాన్స్ తీసుకున్నారని.. తర్వాత సినిమా విడుదలైన రెండు రోజులకు మిగిలిన పారితోషకం మోత్తం ఇచ్చామని జీ.వి.జి రాజు తెలిపారు. ఏది ఏమైన కేరీర్ మొదటిలో పవన్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు ఎంతో సపోర్ట్‌గా ఉండే వారిని మరోసారి రాజు గుర్తు చేశారు.