సామజవరగమన ” ట్రైల‌ర్‌లో ఈ వెరైటీ పాయింట్ గ‌మ‌నించారా… క‌నెక్ట్ అయితే బ్లాక్‌బ‌స్ట‌రే ( వీడియో)

శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సామజవరగమన పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించ‌గా.. ఈ నెల 29న నిఖిల్ స్పై సినిమాకు పోటీగా రిలీజ్ అవుతోంది. ఇక తాజాగా ట్రైల‌ర్ కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ ప్ర‌కారం ఈ సినిమా మేకర్స్ సినిమా కంటెంట్‌పై చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బుధ‌వారం ఏకంగా హైద‌రాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణ‌లో ప‌లు చోట్ల స్పెష‌ల్ ప్రీమిర్లు ప్లాన్ చేశారు. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే ప్రీమియ‌ర్లు వేస్తుండ‌డం అంటే ఖ‌చ్చితంగా కంటెంట్ మీద న‌మ్మ‌కం ఉండాలి.

హైదరాబాద్ తో పాటు రేపు విజయవాడ, వైజాగ్, నెల్లూరు, గుంటూరు, కడప, కాకినాడ, ఏలూరులో ప్రీమియర్లను ప్లాన్ చేశారు. రెబా మోనికా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక శ్రీవిష్ణు కాస్త డిఫరెంట్ కథలు ఎంచుకుంటాడు.

సామజవరగమన ట్రైల‌ర్లోనే వెరైటీ పాయింట్ చూపించేసారు. ఐ లవ్ యు అన్న వారందరికీ హీరో రాఖీ కట్టేయడం కొత్త పాయింట్‌గా ఉంది. ట్రైల‌ర్ చూస్తే ప‌క్కా ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తోంది. హీరో, హీరోయిన్ టీజింగ్, ఇలా ఫక్తు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫన్ స్టోరీ అని తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా అంద‌రికి న‌చ్చే ఫ‌న్ , ఫ్యామిలీ స్టోరీగా ట్రైల‌ర్ చెప్పేసింది.

వెన్నెల కిషోర్ కామెడీతో పాటు సీనియ‌ర్ నటుడు నరేష్ ఫన్ బాగా పండిస్తారు. సామజవరగమన అనే టైటిల్ కు సినిమాతో ఎలా లింక్ ఉంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే ట్రైల‌ర్ మాత్రం మంచి ఫీల్ తీసుకువ‌చ్చింది.
గోపీసుందర్ సంగీతం ఆక‌ట్టుకుంది.