ఫ్లాప్ అని ముందే తెలిసి కూడా బాల‌య్య చేసిన సినిమా ఇదే..!

చిత్ర పరిశ్రమంలో కొత్త హీరోలైన సీనియర్ హీరోలైనా సరే ఓ సినిమా కథ వినేటప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలో, సినిమా అవుట్‌ఫుట్ చూసినప్పుడు దర్శక నిర్మాతలకు అలాగే హీరోలకు ఇది ఆడుతుందా..? ఆడదా..? అనేది తెలిసిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వారి అంచనాలు తలకిందులైనా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిశాక కూడా ఆ సినిమా చేశారంటే అది కచ్చితంగా హీరో మొహమాటం లేదా కంమిట్ అయ్యే ఉంటుంది.

Amazon.in: Buy Tiragabadda Telugu Bidda Full Telugu Length Movie DVD + 1  FREE CD DVD, Blu-ray Online at Best Prices in India | Movies & TV Shows

ఇలా ఎందరో మంది స్టార్ హీరోలు, హీరోయిన్ల జీవితంలో జరిగాయి. ఇప్పుడు ఇలాంటి అనుభవమే నందమూరి బాలకృష్ణకు కూడా ఎదురైంది. బాలకృష్ణ సినీ కెరీర్ లో 80వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు రీచ్ అయ్యే ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు బాలయ్య. ఆ సమయంలో ఆయన నటించిన సినిమాలలో “తిరగబడ్డ తెలుగు బిడ్డ” అనే సినిమా హిట్ అవ్వ‌దు అని తెలిసినా కూడా ఈ సినిమా చేయక తప్పలేదు.

Tiragabadda Telugu Bidda Telugu Full Length Movie || Bala Krishna  Nandamuri, Bhanu Priya - YouTube

కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తేజస్వి ప్రొడక్షన్ బ్యానర్ పైన బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ నిర్మించారు. భానుప్రియ హీరోయిన్ గా నటించగా.. బాలయ్య మరో సోద‌రుడు నందమూరి మోహన్ కృష్ణ కెమెరామేన్ గా వ్యవహరించగా.. బాలకృష్ణ ఈ సినిమాలో రవితేజ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించారు. 1988 మే 11 వచ్చిన ఈ సినిమా బాలయ్య ఊహించినట్టుగానే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఫలితం ముందుగానే ఊహించిన బాలయ్య ఈ యాక్షన్ సినిమాకు ఎందుకు ఒప్పుకున్నారు అంటే..? అన్నయ్య హరికృష్ణకి ఈ కథ మీద, దర్శకుడు కోదండరామిరెడ్డి మీద ఉన్న నమ్మకంతో సినిమా చేశారు. మొదట బాలయ్య వద్దని వారించిన.. తన అన్న హరికృష్ణ మాటకు అడ్డు చెప్పలేక బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలిసిన కొన్ని తప్పని పరిస్థితిలో ఈ సినిమా చేయాల్సి వచ్చిందని బాలయ్య స్వయంగా చెప్పారు.