సుధీర్ బాబుకు కృష్ణ పెట్టిన షాకింగ్ కండీష‌న్ ఏంటో తెలుసా.. వీరి పెళ్ళి వెనుక ఇంత క‌థ ఉందా..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బావ సుధీర్ బాబు గురించి కొత్తగా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సుధీర్ సినిమాలోకి రాక ముందు ఏపీ మ‌రియు క‌ర్ణాట‌క‌లో నెం.1 బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక త‌ర్వాత 2012లో శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్రేమ కథా చిత్రమ్ తో కమర్షియల్ విజ‌యం అందుకున్నాడు. అలా టాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేసుకుంటూ మీడియం రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక 2021లో సుధీర్ బాబు హీరోగా వ‌చ్చిన‌ శ్రీదేవి సోడా సెంటర్ మంచి విజ‌యం సాధించింది. కానీ, ఈ సినిమా త‌ర్వాత‌ వ‌చ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ప్ర‌స్తుతం సుధీర్ బాబు మామా మశీంద్ర, హరోమ్ హర సినిమాల‌తో పాటు మాజీ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ లో న‌టిస్తున్నాడు. ఇక సుధీర్ బాబు వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 2006లో ఈయన మ‌హేష్ చెల్లి ప్రియదర్శిని పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఈ జంట‌కు ఇద్ద‌రు కుమారులు ప్రియ‌ద‌ర్శిని ఎవ‌రో కాదు సూప‌ర్ స్టార్ కృష్ణ మూడో కుమార్తె. అయితే నిజానికి సుధీర్ బాబును అల్లుడుగా చేసుకోవ‌డం కృష్ణ‌కు ఆస‌లు ఇష్టంలేద‌ట‌. త‌న కూతురును గోప్ప‌ కోటీశ్వ‌రుల ఇంటికి కోడ‌లుగా పంపాల‌ని కృష్ణ అనుకున్నార‌ట‌. అయితే సుధీర్ బాబు, ప్రియ‌ద‌ర్శిని ప్రేమించుకున్నారు అని తెలియ‌డంతో కూతురు ప్రేమ‌కు అడ్డు చెప్ప‌లేక కృష్ణ సుధీర్ బాబుకు ఓ కండీష‌న్ పెట్టార‌ట‌.

నా కూతురితో పెళ్లి త‌ర్వాత సుధీర్ బాబును ఇల్లరికం రావాలని కృష్ణ చెప్పార‌ట‌. అందుకు మొద‌ట సుధీర్ బాబు అంగీక‌రించ‌క‌పోయినా.. ప్రియ‌ద‌ర్శినిపై త‌న‌ ప్రేమ‌ను చంపుకోలేక కృష్ణ మాట‌ల‌కు అంగాక‌రించడు. 2006లో ఇరు కుటుంబ‌స‌భ్యులు క‌లిసి సుధీర్ బాబు, ప్రియ‌ద‌ర్శ‌నిల వివాహం ఎంతో వైభ‌వంగా వివాహం జ‌రిపించారు.