అప్పుడప్పుడు మనకు పాత నాణాలు వంటివి కనిపిస్తూ ఉంటాయి.. అలానే కొన్ని కాయిన్స్ ని కూడా స్పెషల్గా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఈ విషయం ఇలా ఉంచితే ఇప్పుడు ఎన్టీఆర్ పేరట ₹100 నాణాన్ని ఈరోజు రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు నందమూరి కుటుంబసభ్యులు కూడా హాజరుకానున్నారు.
అదేవిధంగా ఈ ఈ కాయిన్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ జీవితం గురించి 20 నిమిషాల వీడియోని అక్కడ ప్లే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విడుదల చేసే ఎన్టీఆర్ కాయిన్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయట. ఈ కాయిన్ తయారీలో కొన్ని లోహాలను వినియోగించారట.. దీని చుట్టుకొలత 44 మీటర్లు.
ఈ కాయిన్ తయారీలో 50% వెండి, 40% రాగి, ఐదు శాతం నిఖిల్, ఐదు శాతం జింక్ ని వినియోగించినట్లు తెలుస్తుంది. ఈ నాణానికి సంబంధించిన ఫోటోలు, వార్తలు వైరల్ గా మారాయి. ఇక అదే విధంగా ఈ నాణాని విడుదల చేసిన తర్వాత మరికొన్ని వార్తలు కూడా బయటకు వస్తాయి. ఇక ఒకవైపు మూడు సింహాలు, అశోక చక్రం ఈ కాయిన్ పై ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్క ఎన్టీఆర్ ఫోటో వందేళ్ళను సూచిస్తూ ఉంటుంది. మరీ గంటలోనే ఎన్టీఆర్ ₹100 కాయిన్ ప్రజల ముందుకు రాబోతుంది.