‘ ఆది పురుష్‌ ‘ సినిమాతో చిక్కుల్లో ప‌డ్డ ఇండియ‌న్ సినిమా… పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చిందిగా…!

రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఆది పురుష్‌ సినిమా భారీ అంచనాల నడుమ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ రాముడు గా కృతి సనన్‌ సీతగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనిపై వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. వాల్మీకి రచించిన రామాయణమే కాదు.. మరో కొత్త రామాయణాన్ని సృష్టించారని చాలామంది మండిపడుతున్నారు. దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలా తెర‌కెక్కించాడు.

Kathmandu | History, Population, Elevation, & Facts | Britannica

మన భారతీయ సంప్రదాయాలు చరిత్ర‌ను ఈ సినిమాలో ఒకటి కూడా కనిపించవు. ముఖ్యంగా రావణాసురుడు రూపం అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఏ కోశానా సైఫాలీ ఖాన్ ఇందులో రావణుడిగా కనిపించలేదు.ఇదే సమయంలో ఈ సినిమా విడుదైన తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై భారీ స్థాయిలో నెగెటివిటీ పెరిగింది. మన పక్క దేశమైన నేపాల్ లో ఈ సినిమాపై తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో సీతామాత భారతదేశంలో పుట్టారని చెప్పిన డైలాగ్ ను వారు తప్పుపడుతున్నారు. మన ఇతిహాసాల గ్రంథాల ప్రకారం సీతామాత నేపాల్ లో పుట్టిందని అంటారు. నేపాల్ ప్రజలు కూడా ఆ విశ్వాసంతోనే ఉన్నారు. ఆదిపురుష్‌ సినిమాలో ఇలాంటి డైలాగ్‌ పెట్టడంతో వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నేపాల్ లోని ఖాట్మండు సిటీలో భారతీయ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్టు ఆ సిటీ మేయర్ బాలేంద్ర షా అధికారికంగా ప్రకటించారు.

Prabhas, Kriti Sanon turn Ram and Sita in new poster of Adipurush. See here  - India Today

భారతీయ సినిమాలను నేపాల్ లో విడుదల చేయడానికి వీల్లేద‌ని ఆయన‌ ప్రకటించాడు. ఈ ప్రకటన‌తో భారతీయ సినిమాలకు గట్టి దెబ్బ పడింది. ఆదిపురుష్‌ సినిమాలో ఆ డైలాగ్ వెంట‌నే తొలగించాలని వారు కోరారు. సీతమ్మ మా నేపాల్లో పుట్టింది అది మా హక్కు అంటూ వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వారు మరో మూడు రోజులు గ‌డువు ఇవ్య‌గా ఆ సమయంలోపు ఈ డైలాగ్‌ తొలగించకపోతే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.