స‌మంత మ‌న‌సులో ఆ హీరో… ఎవ్వ‌రికి తెలియ‌ని ప్రేమ బ‌య‌ట పెట్టేసింది…!

సమంత నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందు.. ఇచ్చాక కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఇప్పుడు సమంత ఏం చేసినా ? సౌత్ ఇండియన్ మీడియాకు పెద్ద సంచలన విషయంగా మారిపోతుంది. అటు బాలీవుడ్ లోనూ ఇప్పుడు ఆమెకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. చైతన్యతో విడాకులు తర్వాత సమంత ఒక స్వేచ్ఛ పక్షిగా విహంగం చేస్తోంది. ఆమె ఏం చేసినా ? అడ్డు చెప్పేవారే లేరు. ఆమె జీవితం ఆమె ఇష్టం.

సినిమాలలోనూ తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళుతోంది. ఎక్కడ రాజీ పడటం లేదు. తాజాగా ఆమె మనసులో మరో హీరో ఉన్న విషయం ఇప్పుడు బయటపడింది. సమంత మనసులో అతడు ఒక డ్రీమ్ హీరో.. అతడు ఎవరో కాదు ? మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్. సమంతకు ఫాహద్ విషయంలో ఒక కోరిక ఉందట. మలయాళంలో స్ట్రైట్ సినిమా చేస్తే ఫాహాద్‌ ఫాజిల్ తో నటించాలనే కోరికను సమంత తాజాగా వ్యక్తం చేసింది.

గతంలో అతడితో ఒక సినిమాలో నటించినా.. అది చాలా చిన్న పాత మాత్రమే అని .. అది తనకు చాలదని అత‌డితో ఒక ఫుల్ లెన్త్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని ఉందంటూ సామ్ తన మనసులో కోరిక బయటపెట్టింది. మలయాళంలో నేరుగా సినిమా ఎప్పుడు ? చేస్తారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆమె తన డ్రీం హీరో కోరికను బయటపెట్టింది.

ఏదో ఒక రోజు తను మలయాళంలో సినిమా చేస్తానని.. ఆ సినిమాలో ఫాహద్ హీరోగా నటిస్తే తనకు ఫుల్ హ్యాపీ అని ప్రకటించింది. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14న రిలీజ్ రెడీ అవుతోంది. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో సమంత బిజీబిజీగా గడుపుతోంది.

Tags: actress samantha, akkineni samntha, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news